రూమ‌ర్స్‌పై బాబి కామెంట్స్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. అదీ త‌న రెండో సినిమాకే ఆ అవ‌కాశం ద‌క్కించుకొంటే అదృష్ట‌వంతుడే అనుకోవాలి. కానీ.. బాబీ విష‌యంలో సీన్ రివ‌ర్స్ అయ్యింది. ‘స‌ర్దార్ – గ‌బ్బ‌ర్ సింగ్’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆఫ‌ర్ ద‌క్కించుకొన్నా.. ఆసినిమాకి ద‌ర్శ‌కుడు అనిపించుకొన్నా, బాబిపై ఎన్ని రూమ‌ర్లో. అస‌లు ఈసినిమాకి బాబి ద‌ర్శ‌కుడు కాద‌ని, అత‌ని పేరు మీద ప‌వ‌న్ అంతా న‌డిపిస్తున్నాడ‌ని, ఈ సినిమాకి ఇద్ద‌రు ముగ్గురు ద‌ర్శ‌కులు ఉన్నార‌ని, బాబి కేవ‌లం నిమిత్త‌మాత్రుడ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వీటిపై బాబి స్పందించాడు.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమా అంటే… ఇలాంటి గాసిప్పులు రావ‌డం మామూలే అని. తాను ఏనాడూ ఇలాంటి న్యూసుల‌ను ప‌ట్టించుకోలేద‌ని అంటున్నాడు బాబి. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇచ్చిన స్వేచ్ఛ అంతా ఇంతా కాదని, ఓ కొత్త ద‌ర్శ‌కుడు అని చూడ‌కుండా త‌న‌ని బాగా ఎంక‌రేజ్ చేశార‌ని, ప‌వ‌న్ ఏ విష‌యంలోనూ అస్స‌లు జోక్య‌మే చేసుకోలేద‌ని అంటున్నాడు బాబి. ఈసినిమాకి నేనే ద‌ర్శ‌కుడ్ని అని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నాడు. ప‌వ‌న్‌తో సినిమా చేయ‌డం త‌న అదృష్ట‌మ‌ని, వీలైతే చిరంజీవితో కూడా ఓ సినిమా చేస్తాన‌ని అంటున్నాడు బాబి. స‌ర్దార్ ఈనెల 8న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మ‌రి ఈసినిమాతో బాబి రేంజ్ ఏ విధంగా మారుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close