స్క్రిప్టు వ‌ర్క్‌లో క్రిష్ బిజీ

ఇదివ‌ర‌కెప్పుడూ లేనంత ఒత్తిడిలో ఉన్నాడు క్రిష్‌. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో రెండు భాగాలూ ప‌ల్టీ కొట్టాయి. దాంతో పాటు… మ‌ణిక‌ర్ఱిక కూడా వివాదాల‌లో చిక్కుకుంది. ఆ సినిమా విష‌యంలో వ‌చ్చిన ఆ కొంచెం క్రెడిట్ కూడా కంగ‌నా ర‌నౌత్ ప‌ట్టుకెళ్లిపోయింది. ఇప్పుడు త‌న త‌దుప‌రి సినిమా విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నాడు. త‌న ఆస్థాన ర‌చ‌యిత బుర్రా సాయిమాధ‌వ్‌తో క‌ల‌సి.. స్క్రిప్టు ప‌నులు మొద‌లెట్టారు. క్రిష్ బాలీవుడ్‌లో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని, ఆ త‌ర‌వాతే… తెలుగు సినిమా గురించి ఆలోచిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు మాత్రం క్రిష్ తెలుగు సినిమాపైనే దృష్టి పెట్టాడ‌ని స‌మాచారం. ఓ అగ్ర క‌థానాయ‌కుడి కోసం క్రిష్ ఓ స్క్రిప్టు త‌యారు చేస్తున్నాడ‌ని, పూర్తి స్థాయిలో క‌థ సిద్ధ‌మైన త‌ర‌వాత‌.. ఆ క‌థ‌ని ఆ హీరోకి వినిపిస్తాడ‌ని స‌మాచారం. స్క్రిప్టు ప‌నులు ఓ కొలిక్కి రావ‌డానికి క‌నీసం నెల రోజులైనా ప‌డుతుంద‌ని తెలుస్తోంది. ఆ త‌ర‌వాతే.. క్రిష్ సినిమాలో హీరో ఎవ‌ర‌న్న విష‌యంలో ఓ స్ప‌ష్ట‌త వ‌స్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close