సాక్ష్యం: వీడియో గేమ్‌ల క‌థ‌ ?

బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ – శ్రీవాస్‌ల సినిమా ‘సాక్ష్యం’పై మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైల‌ర్లో చూపించిన విజువ‌ల్స్ క‌ట్టిప‌డేస్తున్నాయి. సోషియో ఫాంట‌సీ క‌థ కావ‌డంతో – ఏదో ఓ ఆస‌క్తిక‌ర‌మైన పాయింట్ ఉంటుంద‌ని జ‌నాలు న‌మ్ముతున్నారు. పంచ‌భూతాల క‌థ అని ప్రచారం చేస్తోంది చిత్ర‌బృందం. అయితే… ఇందులో వీడియో గేమ్‌ల‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన ఎలిమెంట్ ఉంద‌ట‌. ఈ చిత్రంలో సాయి శ్రీ‌నివాస్ వీడియో గేముల డ‌వ‌లెప‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. తాను త‌యారు చేసిన గేమ్‌లానే.. త‌న శ‌త్రువులు కూడా ఒకొక్క‌రుగా అంత‌మైపోతార‌ట‌. అలా.. వీడియో గేముల‌కూ, ప్ర‌తినాయ‌కుల అంతానికీ ఓ లింకు పెట్టుకున్నాడు ద‌ర్శ‌కుడు. వింటుంటే.. ఈ పాయింట్ కొత్త‌గానే అనిపిస్తోంది. షారుఖ్ ఖాన్ ‘రా వ‌న్‌’ కూడా వీడియో గేముల నేప‌థ్యంలో సాగే క‌థే. దానికీ, దీనికీ ఏమైనా పోలిక‌లు ఉన్నాయేమో చూడాలి. పూజా హెగ్డే గ్లామ‌ర్ ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.