ప్రభుత్వ పథకాల లబ్దిదారులందరూ టీడీపీకి ఓటేశారా…?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటు దృష్టితో కానీ.. ..మరో కారణం కానీ.. పెద్ద ఎత్తున.. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ఏపీలోని అరవై ఆరు శాతం కుటుంబాలు ప్రభుత్వ పథకాల లబ్ది పొందాయి. ఈ ఓట్లన్నీ.. తెలుగుదేశం పార్టీకి పడ్డాయా..? అంటే.. ఆలోచించాల్సిన పరిస్థితే. ఎందుకంటే.. పథకాల లబ్దిదారులంతా.. ఏకపక్షంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఎప్పుడూ ఓటు వేయరు. అందులోనూ.. అనేక అంశాలు ఇమిడి ఉంటాయి. ఏపీలోనూ అదే జరిగి ఉంటుంది. అయితే ప్రభుత్వాలు కూడా.. తమ పథకాల వల్ల లబ్ది కలుగుతుంది కాబట్టి… మొత్తం తమకే ఓటు వేయాలని కోరుకోరు. వారి లక్ష్యం.. ప్రత్యర్థి పార్టీకి చెందిన ఓట్లలో చీలిక తీసుకు రావడమే. ప్రత్యర్థి పార్టీకి చెందిన వారిలో.. ఓ పదిశాతం అయినా… మార్పు తీసుకు వస్తే… వచ్చే ఫలితం తేడాగా ఉంటుంది. అందుకే.. ఓ ప్లాన్ ప్రకారం.. అధికారపార్టీ… సంక్షేమ ఫలాల వరద పారించింది.

తెలంగాణ సర్కార్ రైతులకు… రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఆ పథకం గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటర్లను… గట్టిగానే … మార్చింది. దాదాపుగా.. 30 శాతానికిపైగా కాంగ్రెస్ పార్టీ ఓటర్లు…. టీఆర్ఎస్ వైపు మొగ్గారు. ఇక పెన్షన్ పెంచుతామని హామీని మాత్రమే టీఆర్ఎస్ ఇచ్చింది. కానీ.. ఏపీ సర్కార్.. పెంచి మరీ ఎన్నికలకు వెళ్లింది. ఇది నేరుగా ప్రభావం చూపించే పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా… వైసీపీ సానుభూతి పరుల ఓట్లు కూడా కొన్ని టీడీపీకి పడ్డాయి. ఓటు బ్యాంక్ ను నిలబెట్టుకునే ప్రయత్నంలో.. వైసీపీ సక్సెస్ అయినప్పటికీ… పథకాల కారణంగా.. నేరుగా అందిన డబ్బుతో.. వైసీపీ కొంత నష్టపోవాల్సి వచ్చింది.

అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత అనేది.. అంత తీవ్ర స్థాయిలో ఉన్న సూచనలేమీ కనిపించలేదు. వాస్తవానికి తెలంగాణలో అభ్యర్థులకు.. ఎదురైన వ్యతిరేకత అంతా ఇంతాకాదు. అయినప్పటికీ.. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయాలు నమోదు చేశారు. అదంతా ప్రభుత్వ పథకాల ప్రభావమే. ఏపీలో ఆ వ్యతిరేకత పెద్దగా కనిపించలేదు. ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు.. సమర్థంగా నడిపారన్న అభిప్రాయమే ఎక్కువ మందిలో ఉంది. అదే సమయంలో ఆ పేరుతో సంక్షేమానికి కోత పెట్టలేదు. ఈ పరిస్థితి పోలింగ్ సరళిలో బయటపడిందని కొంత మంది అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close