కవితకు చేరిన ఈడీ నోటీసులు !

ఢిల్లీ లిక్కర్ స్కాం మాస్టర్ మైండ్ కవితేనంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు ఆషామాషీ కాదని తేలింది. కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె కరోనా సోకడంతో క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ కారణంగా ఈడీ అధికారులు నోటీసులను కుటుంబ సభ్యులకు ఇచ్చారు. కరోనా తగ్గిన తర్వాత ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.

సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. గతంలో ఓ సారి దేశవ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ… ఇప్పుడు కేవలం హైదరాబాద్ లో జరిగిన వ్యవహారాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్ సిటీలో రెండుసార్లు సోదాలు జరిపింది. గత తనిఖీల సమయంలో రామచంద్రపిళ్లై ఇల్లు, ఆఫీస్ లలో సోదాలు జరిగాయి. ఇప్పుడు కవిత పర్సనల్ ఆడిటర్ అయిన గోరంట్ల అండ్ అసోసియేట్స్‌ ఆడిటర్ బుచ్చిబాబు ఇంట్లోనూ సోదాలు జరగాయి. ఆ సమయంలోనే కవితకు నోటీసులు జారీ అయ్యాయి.

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి కల్వకుంట్ల కవితపై పలు ఆరోపణలను బీజేపీ నేతలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఆమె ప్రమేయం కీలకమని.. ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కల్వకుంట్ల సన్నిహితులుగా పేరు పడిన అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ రావు, సూదిని సృజన్ రెడ్డి వంటి వారి ఇళ్లలో రెండు సార్లు సోదాలు నిర్వహించింది. తాజాగా కవితకు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : ఏపీ రాజధానేదో ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి !

పాలకుడు సొంత రాష్ట్రంపై కుట్రలు చేసుకునేవాడు అయి ఉండకూడదు. సొంత ప్రజల్ని నాశనం చేసి తాను ఒక్కడినే సింహాసనంపై కూర్చుని అందర్నీ పీల్చి పిప్పి చేయాలనే వ్యక్తిత్వం ఉండకూడదు. అలా ఉంటే...

ఎడిటర్స్ కామెంట్ : గుర్తుకొస్తున్నావయ్యా.. శేషన్ !

టీ.ఎన్.శేషన్. ఈ పేరు భారత్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా స్మరించుకుంటూనే ఉన్నారు. గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఆయనను మరిపించేలా మాత్రం ఎవరూ రావడం లేదు. ఎన్నికల సంఘం...

నిప్పుల కుంపటిలా తెలంగాణ..

తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మరింత ముదురుతున్నాయి. భానుడు ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో నాలుగైదు రోజులపాటు వేసవి తీవ్రత ఇలాగే ఉంటుందని.. ఎండతోపాటు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ...

రేవంత్ కు హైకమాండ్ అభినందనలు..ఎందుకంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రశంసల జల్లు కురిపించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ లేవనెత్తుతోన్న అంశాల ఆధారంగా కాంగ్రెస్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో పెరుగుతోందని రేవంత్ పని తీరును...

HOT NEWS

css.php
[X] Close
[X] Close