రేవంత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ఈటల !

బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ … తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డికి గుడ్ న్యూస్ చెప్పారు. అది ఆయన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడ కాదు. ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని ఆయన చెప్పకనే చెప్పేశారు. హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన .. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇద్దరూ బీజేపీలో చేరడం కష్టమేనని.. స్పష్టం చేశారు. చేరికల కమిటీ చైర్మన్ గా బీజేపీలో చేరాలని వారితో చర్చలు జరిపితే.. రివర్స్ లో తనకు కౌన్సెలింగ్ ఇస్తున్నారని చెబుతున్నారు. ఎందుకా కౌన్సెలింగ్ అని చెప్పలేదు కానీ.. తిరిగి ఈటలనే కాంగ్రెస్ లో చేరదాం రమ్మని అడుగుతున్నట్లుగా భావిస్తున్నారు.

వాళ్లిద్దరూ బీజేపీలో చేరడానికి ఇష్టపడకపోవడానికి కారణాలు కూడా చెబుతున్నారు ఈటల. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ బలంగా ఉంది. బిజెపి లేదు. పొంగులేటి, జూపల్లితో నేను రోజూ మాట్లాడుతున్నాను. వారే నాకు రివర్స్‌ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. బిజెపిలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులున్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరకుండా మాత్రమే ఆపగలిగానని.. కానీ బీజేపీలోకి తీసుకు రాలేకపోయానని ఈటల చెప్పుకొచ్చారు. ఈ ప్రకారం చూస్తే.. ఈటల కూడా.. రేపో మాపో .. కౌన్సెలింగ్ కి కరిగిపోతారేమో తెలియదు కానీ..ఆయనను పార్టీలోకి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. పదే పదే పేరు పెట్టి పిలుస్తున్నారు.

టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు. వారు వారు బీజేపీలో చేరరని అంటున్నారు. బీజేపీని కల్పనా రాయ్‌గా.. కాంగ్రెస్ ను ఐశ్వర్రాయ్‌గా పోల్చుతూ.. పెళ్లి చూపులు చూస్తున్నారని..ఎవర్ని ఎంచుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఇతర నేతలందర్నీ కూడా కాంగ్రెస్ లోకి రావాలని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ ను కూడా పిలుస్తున్నారు. ఏలా చూసినా .. చేరికల కమిటీ చైర్మన్ ఈటల వారిద్దర్నీ బీజేపీలోకి ఆకర్షించడంలోకి విఫలమయ్యారు. మరి ఈటల చెప్పినట్లుగా వారి రివర్స్ కౌన్సెలింగ్ వారిపై ఏమైనా ప్రభావం చూపిందో లేదో త్వరలోనే తేలనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిప్పుల కుంపటిలా తెలంగాణ..

తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మరింత ముదురుతున్నాయి. భానుడు ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో నాలుగైదు రోజులపాటు వేసవి తీవ్రత ఇలాగే ఉంటుందని.. ఎండతోపాటు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ...

రేవంత్ కు హైకమాండ్ అభినందనలు..ఎందుకంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రశంసల జల్లు కురిపించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ లేవనెత్తుతోన్న అంశాల ఆధారంగా కాంగ్రెస్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో పెరుగుతోందని రేవంత్ పని తీరును...

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close