సంచలన కేసు: స్వతంత్ర భారత దేశం లో తొలిసారిగా మహిళ కి ఉరి శిక్ష అమలు

స్వాతంత్ర్య భారత దేశంలో ఇప్పటి వరకు ఏ మహిళ కి ఉరి శిక్ష అమలు కాలేదు. రాజీవ్ గాంధీ హత్య, తీవ్రవాదానికి సంబంధించిన కేసు లాంటి అనేక పెద్ద కేసులలోను మహిళలు ఇన్వాల్వ్ అయినప్పటికి, వారికి జీవిత ఖైదు శిక్షలు పడ్డాయే తప్పించి ఉరిశిక్షలు పెద్దగా పడలేదు. ఉరి శిక్షలు విధించబడ్డ అతికొద్ది సందర్భంలో కూడా పై కోర్టులో దాన్ని జీవిత ఖైదుగా మార్చడం జరిగింది. అత్యంత అరుదైన సందర్భాలలో కోర్టులు ఉరిశిక్ష విధించినప్పటికీ రాష్ట్రపతి క్షమాభిక్ష ద్వారా శిక్ష తగ్గించబడింది. అయితే ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా అన్ని కోర్టులు ఉరిశిక్షను ఖరారు చేయడమే కాకుండా, రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా రద్దు అయిన సందర్భంగా ఒక మహిళకు ఉరిశిక్ష అమలు కాబోతుంది. వివరాల్లోకి వెళితే..

  ప్రేమికుడి కోసం సొంత కుటుంబాన్ని మొత్తం మట్టుబెట్టిన షబ్నం :

షబ్నం అనే ఉత్తర ప్రదేశ్ కు చెందిన యువతి ఉన్నత విద్యావంతురాలు. ఇంగ్లీష్ లో నూ జాగ్రఫీలో నూ, ఎం.ఏ పూర్తి చేసింది. గ్రామంలోని ప్రైమెరీ స్కూల్ లో టీచర్ గా పని చేస్తోంది. అయితే తమ ఇంటి సమీపంలో చిన్నా చితకా పనులు చేసుకునే సలీం అనే అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే అతను కేవలం ఐదో తరగతి మాత్రమే చదువుకొని ఉండటం కారణంగా కుటుంబ సభ్యులు పెళ్లికి అభ్యంతరం చెప్పారు. తన విద్యార్హత, ఉద్యోగానికి తగిన చక్కని సంబంధం చూసి పెళ్లి చేసుకోవాల్సిందిగా సూచించారు. కుటుంబ సభ్యులు, తన ప్రియుడు సలీం తో తన పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఆమె కుటుంబం మొత్తం పై పగ పెంచుకుంది.

2008వ సంవత్సరంలో ఒకరోజు రాత్రి పాలలో మత్తు మందు కలిపి కుటుంబ సభ్యులందరికీ ఇచ్చింది. వారందరూ పడుకున్న తర్వాత తన ప్రియుడు సలీం ని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరు కలిసి కుటుంబం మొత్తాన్ని రాత్రికి రాత్రి కడతేర్చారు. తల్లి, తండ్రి, ఇద్దరు అన్నలు, వారి భార్యలు, పిల్లలు మొత్తం అందరిని వీరు ఆ రాత్రి చంపేశారు. తన అన్న కుమారుడు, పది నెలల వయసున్న బాబును కూడా షబ్నం చంపేసింది. అమ్రోహ జిల్లా కోర్టు లో ఈ కేసు రెండేళ్ల పాటు నడిచింది. తర్వాత అలహాబాద్ హైకోర్టుకు కేసు చేరుకుంది. అన్ని కోర్టు ల లోను ఆవిడకు ఉరిశిక్ష పడింది. దీనిమీద సుప్రీంకోర్టుకు వెళ్లగా 2015 లో సుప్రీంకోర్టు కూడా ఉరిశిక్ష ఖరారు చేసింది.

  క్షమాభిక్ష ఇవ్వని రాష్ట్రపతి:

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 కింద ఉరిశిక్ష ఖరారైన నిందితులకు క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్రపతికి ఉంది. పలు సందర్భాలలో నిందితులు మహిళలు అనే కారణం లేదా ఇతరత్రా కారణాల వల్ల ఉరి శిక్షను జీవితఖైదుగా మారేలాగా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో రాష్ట్రపతి సైతం క్షమాభిక్ష తిరస్కరించారు. దీంతో అన్ని దారులు మూసుకు పోయినట్లే అయింది. డెత్ వారెంట్ జారీ అయిన వెంటనే ఉరి తీసే అవకాశం ఉంది. షబ్నం ప్రస్తుతం రాంపూర్ జిల్లా జైలులో ఉండగా సలీం ఆగ్రా జైలులో ఉన్నారు.

  మధుర జైలు దేశంలో మహిళా ఉరిశిక్ష గది ఉన్న ఏకైక జైలు:

ఒక ఖైదీ ని ఉరిశిక్ష తీయడానికి కావలసిన వసతులూ కొన్ని జైళ్ళ లో మాత్రమే ఉంటాయి. అయితే మహిళా ఖైదీలను ఉరిశిక్ష తీయడానికి అనువైన వసతులు, జరపవలసిన పరీక్షలు అన్ని ఉన్న జైలు భారత దేశంలో కేవలం ఒకటే ఉంది. అదే ఉత్తర ప్రదేశ్లోని మధుర జిల్లా జైలు. భారతదేశ చరిత్రలో స్వాతంత్ర్యానికి పూర్వం కొంతమంది మహిళలకు మరణశిక్ష విధించినప్పటికీ, స్వాతంత్రానంతరం మహిళకి ఇప్పటివరకు ఉరి శిక్ష అమలు కాకపోవడంతో మహిళలను ఉరిశిక్ష వేయడానికి అనువైన వసతులు ఉన్న జైళ్ల ప్రస్తావన, చర్చ పెద్దగా ఎక్కడ రాలేదు. అయితే ఇప్పుడు షబ్నం కారణంగా ఇటువంటి ఏర్పాట్లు కలిగిన జైళ్ల పై చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. డెత్ వారెంట్ జారీ అయిన తరువాత ఆవిడను రాంపూర్ జిల్లా జైలు నుండి మధుర జిల్లా జైలుకు తరలించనున్నట్లు అధికారులు చెబుతున్నారు

ఏది ఏమైనా 2008లో జరిగిన ఈ కేసు లో దాదాపు పుష్కర కాలం తర్వాత ఇప్పుడు తుది తీర్పు అమలు కాబోతోంది. స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఒక మహిళ కి ఉరి శిక్ష అమలు అవుతూ ఉన్నప్పటికీ మహిళా సంఘాలు సహా ఎవరు దీన్ని తప్పు పట్టకపోవడం ఆమె చేసిన నేరం తీవ్రతను సూచిస్తోంది. బహుశా మరికొద్ది రోజుల్లో ఉరిశిక్ష అమలు కావచ్చని తెలుస్తోంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఉరిశిక్ష అమలు అయిన మొదటి నేరస్తురాలిగా షబ్నం ఒక చీకటి పేజీ గా నిలిచిపోతుంది.

  – Zuran

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close