‘పుష్ప’ తరవాత తెలుగులో ఫహద్ ఫాజిల్ బాగా పాపులర్ అయ్యారు. ‘పుష్ప 2’తో ఆయనకు మరింత క్రేజ్ వచ్చింది. కానీ.. తెలుగులో ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. అనిల్ రావిపూడి – వెంకటేష్ కాంబోలో రూపొందే సినిమా కోసం ఫహద్ ని సంప్రదించారన్న వార్తలొచ్చాయి. కానీ ఆ ప్లేస్‌లోకి కల్యాణ్ రామ్ వచ్చారు. ఇప్పుడు మరో తెలుగు సినిమా కోసం ఫహద్ పేరు పరిశీలిస్తున్నారు.
‘ఆంద్రా కింగ్ తాలుకా’ తరవాత రామ్ నటించే సినిమా ఖాయమైంది. రామ్ తన సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ శిష్యుడు విఘ్నేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఇదో యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఫహద్ ఫాజిల్ పేరు పరిశీలిస్తున్నారు. ఈమేరకు చిత్రబృందం ఆయనతో సంప్రదింపులు కూడా మొదలెట్టింది. ఫహద్ కి కథ, ఆయన పాత్ర నచ్చాయి. పారితోషికం దగ్గర బేరాలు జరుగుతున్నాయి. అది ఓకే అయిపోతే… రామ్ సినిమాలో ఫహద్ ని విలన్ గా చూడొచ్చు. శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది. ఆ సందర్భంగా ఫహద్ పేరు బయటకు వదులుతారేమో చూడాలి.
