తెలంగాణ అసెంబ్లీలో అసాధార‌ణ దృశ్యం

సంఖ్యాబ‌లం త‌క్కువ‌గా ఉన్నా ప్ర‌తిప‌క్షాల మాట‌కు విలువ‌నిచ్చే విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసాధార‌ణ పరిణ‌తిని ప్ర‌ద‌ర్శించారు. ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ పై నిన్న‌నే చ‌ర్చ ముగిసినా, అదే అంశంపై మ‌ళ్లీ ఇవాళ చ‌ర్చ‌కు అంగీక‌రించారు. స్పీక‌ర్ అనుమ‌తిస్తే ప్ర‌తిప‌క్ష స‌భ్యులు కోరిన వివ‌ర‌ణ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. దీనిపై మ‌ళ్లీ చ‌ర్చ‌కు అభ్యంత‌రం లేద‌న్నారు.

ఆ త‌ర్వాత ఇదే అంశంపై మ‌రోసారి చ‌ర్చ జ‌రిగింది. కాంగ్రెస్, టీడీపీ నేత‌లు ప్ర‌భుత్వాన్ని దుయ్య‌బ‌ట్టారు. సీఎం స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేద‌ని నిర‌స‌న తెలుపుతూ వాకౌట్ చేశారు. అంత‌కు ముందు ప్ర‌శ్నోత్త‌రాల త‌ర్వాత ఈ అంశం చేప‌డ‌తాన‌ని స్పీక‌ర్ ప్ర‌క‌టించినా ప్ర‌తిప‌క్ష స‌భ్యులు వెంట‌నే చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. దీనిపై స్పీక‌ర్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాద‌న్నారు.

తాము ఎంత సానుకూల ధోర‌ణితో ఉన్నా ప్ర‌తిప‌క్ష స‌భ్యులు కావాల‌ని రాద్ధాంతం చేస్తున్నార‌ని కేసీఆర్ కూడా అస‌హ‌నం వ్య‌క్తంచేశారు. ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ప‌థ‌కాన్ని ప‌క్కాగా అమ‌లు చేస్తామ‌న్నారు. నాణ్య‌త పాటించ‌ని కాలేజీల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుని తీరుతామ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వాలు 1880 కోట్ల రూపాయ‌ల బ‌కాయిల‌ను వ‌దిలి వెళ్లాయ‌ని చెప్పారు. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు 4687 కోట్ల రూపాయలు చెల్లించామ‌ని వివ‌రించారు.

ఒకేసారి వంద శాతం ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ చెల్లించ‌డం సాధ్యం కాద‌ని కేసీఆర్ చెప్పారు అయితే విద్యార్థుల‌కు, కాలేజీకు ఇబ్బంది క‌ల‌గ‌ని విధంగా ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌ని, నిధుల చెల్లిస్తామ‌ని హామీ ఇచ్చారు. త‌ల్లిదండ్రులు ఈ విష‌యంలో ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close