గాంధీ ఫ్యామిలీ లేకుండా కాంగ్రెస్ ఉంటుందా !?

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేందుకు గాంధీ ఫ్యామిలీ సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఖండిస్తున్నప్పటికీ.. ఇప్పటికే గాంధీ ఫ్యామిలీ ఓ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రతీ దానికి గాంధీ కుటుంబాన్ని నిందించడం ఆనవాయితీగా మారిపోయింది. అదే సమయంలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో రాజకీయాల నుంచి వైదొలగడమే మంచిదన్న భావనకు వచ్చినట్లుగా చెబుతున్నారు.

రాహుల్ గాంధీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని వదిలేశారు. మళ్లీ తీసుకోవడానికి ఆయన అంగీకరించడం లేదు. సోనియా గాంధీనే అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇటీవల ఉపఎన్నికల్లో ప్రియాంకా గాంధీ కూడా కష్టపడ్డారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో పార్టీలోకొంత మంది సీనియర్లు జీ -23 పేరుతో అంతర్గత కలహాలు ప్రారంభించారు. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌ పార్టీని మరింత గందరగోళంలోకి నెడుతున్నాయి. ఇక ఇవన్నీ ఎందుకని.. గాంధీ ఫ్యామిలీ రాజీనామాలు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.

పార్టీలో ఉన్న సీనియర్.. జూనియర్ నేతలు పార్టీ కోసం పని చేస్తున్నట్లుగా ఉండటం లేదు. సొతం వర్గం కోసం పని చేస్తున్నట్లుగా ఉంటున్నారు. అంతో ఇంతో బలంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ఈ కారణంగా గెలవాల్సిన చోట కూడా ఓడిపోతున్నారు. వీటిని సరి చేయడానికి గాంధీలు చెప్పే సలహాల్ని.. సూచనల్ని సీనియర్లు పాటించడం మానేశారు. అయితే ఇంత దానికే గాంధీలు రాజీనామా చేయరని కొంత మంది అంటున్నారు.

నిజానికి గాంధీ ఫ్యామిలీ లేకుండా కాంగ్రెస్ పార్టీని ఊహించలేం. వారు పార్టీకి పిల్లర్లులా ఉంటారు. వారు లేకపోతే బీజేపీ చెబుతున్న కాంగ్రెస్ ముక్త్ భారత్‌కు మార్గం సుగమం అయినట్లేనని చెప్పుకోవచ్చంటున్నారు. అయితే గతంలోనూ ఇలాంటి రాజీనామా ల ప్రకటనలు వచ్చినా… పార్టీ నేతలు ధర్నాలు.. నిరసనలు చేసి.. వారినే కొనసాగాలని ఒత్తిడి చేశారని.. అలాంటివే ఇప్పుడూ జరుగుతాయని .. వారు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లోనే ఉంటారని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close