గంటాలో ఫుల్ కాన్ఫిడెన్స్ – లోకేష్ పాదయాత్రకు హాజరు !

టీడీపీ ఓడిపోయిన తర్వాత.. ఇంకా చెప్పాలంటే టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత గంటా శ్రీనివాసరావు ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్య కాలంలో ఆయన వైసీపీలో చేరేందుకు చర్చలు పూర్తయ్యాయన్న ప్రచారం జరిగింది. ఓ దశలో ఆయన కుటుంబానికి చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తులను బ్యాంకులు వేలం వేయడానికి డిసైడైనప్పుడు బీజేపీలో చేరుతారని కూడా చెప్పుకున్నారు. కానీ గంటా అలా ఆవేశంలో నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు. బాగా ఆలోచించి.. ప్రజానాడి పట్టి ఆ ప్రకారమే ముందుకు వెళ్తారు. ఇప్పుడు ఆయనకు క్లారిటీ వచ్చినట్లుగా ఉంది. ఇక టీడీపీనే తన పార్టీ అని డిసైడయిపోయారు.

లోకేష్ పాదయాత్ర ప్రారంభించడానికి ముందు హైదరాబాద్‌లో ఆయనను ఓ సారి కలిశారు. లోకేష్ పాదయాత్ర విజయవంతం అవుతుందని ప్రకటించారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా విస్తృత ప్రచారం చేశారు. నిజమో కాదో కానీ అసలు అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు గంటా శ్రీనివాసరావు చాయిస్ అని కూడా చెబుతున్నారు. మొదట చిన్న లక్ష్మి కుమారి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. అనుకున్నంత పాజిటివ్ వెస్ రాలేదని.. చివరి క్షణంలో చిరంజీవి రావును ప్రకటించారు. అది బాగా వర్కవుట్ అయింది. దీంతో గంట శ్రీనివాస్ చాయిస్ మరోసారి వర్కవుట్ అయిందన్న ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు గంటా శ్రీనివాస్ పాదయాత్రలో ఉన్న లోకేష్ వద్దకు వెళ్లారు. కలిశారు. విశాఖ జిల్లా నేతలు కొంత మంది వెళ్లారు. కానీ అయ్యన్న పాత్రుడు వెళ్లలేదు. గంటా టీడీపీలో యాక్టివ్ కావడాన్ని అయ్యన్న పాత్రుడు వ్యతిరేకిస్తున్నారు. నాలుగేళ్ల పాటు తాము కేసుల పాలై.. ప్రభుత్వంపై పోరాడామని ఇప్పుడు ఆయన వచ్చి .. మళ్లీ పదవులు పొందుదామనుకుంటే ఎలా అని అంటున్నారు. ఎలా చూసినా గంటా ఇష్యూ.. విశాఖ టీడీపీలో కాస్త గందరగోళం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close