ఈ సారి వైఎస్ జయంతికి “చెత్త ఆటోల షో”..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రేసింగ్‌లకు ముందు ఫ్లాగ్ ఆఫ్ చేసే సీన్ బాగా ఇష్టంలా ఉంది. ఆయన వందల కొద్దీ వాహనాలకు అలా.. జెండా ఊపి ప్రారంభించడాన్ని తెగ ఇష్టపడుతున్నట్లుగా ఉంది. విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ఓ సారి 108 వాహనాలు.. ఇంకో సారి రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు అలా జెండా ఊపిన ఆయన ఈ సారి… చెత్త తరలింపు వాహనాలకు జెండా ఊపాలని నిర్ణయించారు. మొత్తంగా ఎనిమిది వేల వాహనాలు కొనుగోలు చేయాలని.. వార్డుకు రెండు చొప్పున కేటాయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జూలై ఎనిమిదో తేదీ లోపు కొనుగోళ్లు పూర్తి చేసి… వాహనాలు రెడీచేస్తే.. ఆ రోజు బెంజ్ సర్కిల్‌లో వాహనాల పరేడ్ పెట్టి… వాటికి జెండా ఊపి సీఎం జగన్ ప్రారంభిస్తారు. జూలై ఎనిమిదో తేదీనే ఎందుకు అంటే…ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి.

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని 108 వాహనాలు కొనుగోలు చేశారు. మిగతా వాటికి రంగులేశారు. అలా మొత్తంగా అన్నీ కొత్తవే ప్రారంభిస్తున్నట్లుగా అన్నిటికీ బెంజ్ సర్కిల్‌లో జెండా ఊపారు. ఆ తర్వాత రేషన్ డోర్ డెలివరీ వాహనాల వంతు. దాదాపుగా తొమ్మిది వేలవాహనాలను కొనుగోలు చేశారు. ఒక్కొక్క వాహనానికి ప్రభుత్వానికి నెలకు ఇరవై వేల కంటే ఎక్కువే ఖర్చు అవుతోంది. ఆ వాహనాలను గుజరాత్‌లో రెడీ చేయించి తీసుకు వచ్చారు. ఇప్పుడు చెత్త కోసం ఎనిమిది వేల వాహనాల్ని కొనాలని డిసైడయ్యారు.

నిజానికి గత ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌లో భాగంగా గ్రామాల్లో పరిశుభ్రతను నెలకొల్పేందుకు చెత్త సేకరణ కోసం గత సార్వత్రిక ఎన్నికల ముందు మండలానికి 15 ఆటోలు మంజూరయ్యాయి. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అర్హులను ఎంపిక చేసి ఆటోలను అందిచాల్సి ఉంది. కాని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టకపోవడంతో అవి నిరుయోగంగా ఉంటున్నాయి. తుప్పుపట్టిపోయిన దృశ్యాలు కొన్ని మీడియా సంస్థలు వెలుగులోకి తెస్తున్నాయి. ఇప్పుడు ఆ వాహనాలకు మళ్లీ రంగులేస్తారా లేకపోతే.. కొత్తవి కొనుగోలు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close