ప్ర‌పంచ‌వ్యాప్తంగా భోజ‌న‌ప్రియుల‌ను అల‌రించ‌నున్న గోదావ‌రి రుచులు

ప్ర‌పంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఇండియ‌న్ రెస్టారెంట్ చైన్ గోదావ‌రి (www.GodavariUS.com) త‌న సేవ‌ల‌ను విశ్వ‌వ్యాప్తంగా వివిధ దేశాల్లో విస్త‌రించ‌డంతో పాటుగా భార‌త‌దేశంలో కూడా రాబోయే నూత‌న సంవ‌త్స‌రంలో ప్రారంభించ‌నుంది.

“టీం” గోదావ‌రికి ఈ సంద‌ర్భంగా ప్రామాణిక‌మైన భోజ‌న రుచుల ప్రియులంద‌రికీ హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతోంది. గోదావ‌రి ప్రారంభం నాటి నుంచి త‌మ‌కు విశేష‌మైన‌ మ‌ద్ద‌తు అందించి ఇంత భారీ స్థాయిలో వృద్ధి చెందేందుకు మ‌రియు త‌క్కువ స‌మ‌యంలోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రించేందుకు అవ‌కాశం క‌ల్పించ‌డం త‌మ కృత‌జ్ఞ‌త మ‌రియు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తోంది.

ద‌క్షిణ భార‌తీయ రుచుల‌ను విశ్వ‌వ్యాప్తంగా విస్త‌రించ‌డంలో గుర్తింపు పొందిన గోదావ‌రి త‌న‌ అంత‌ర్జాతీయ విస్త‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల్లో భాగంగా 2019 సంవ‌త్స‌రం తొలినాళ్ల‌లో కెన‌డా మ‌రియు ఆస్ట్రేలియాలో త‌మ నూత‌న కేంద్రాల‌ను ప్రారంభించ‌నుంది.

“గోదావ‌రి” కేవ‌లం ద‌క్షిణ భార‌తీయ రుచుల‌ను (South Indian Restaurants in USA) వ‌డ్డించే చ‌క్క‌ని ఆతిథ్య కేంద్రంగానే కాకుండా, వివిధ ర‌కాలైన విభిన్న బ్రాండ్ అయిన “కిరాక్‌” (Kiraaak), “స్పైసీ స‌లా” (Spicy Salaa), “ప‌నీర్‌” (Paneer) వంటి మ‌రిన్నింటినో త‌న ఫుడ్ ఫ్యాక్ట‌రీకి వ‌చ్చే ఏడాది జోడించ‌నుంది.

మూడు దేశాల్లో ప్రామాణిక‌మైన రుచుల‌ను ఆత్మీయ‌మైన మ‌రియు మైమ‌రిచిపోయే ఆతిథ్యంతో అందిస్తున్న “గోదావ‌రి” భార‌త‌దేశంలోకి విస్త‌రిస్తోంది. 2019 ప్ర‌థ‌మార్థంలో త‌న తొలి ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేయ‌నుంది. 2019 సంవ‌త్సరంలో భార‌త‌దేశంలో క‌నీసం 6 మ‌రియు కెన‌డాలో 5 కేంద్రాల‌ను ప్రారంభించడం యునైటెడ్ స్టేట్స్‌లోని మిన్నియాపోలిస్‌, నాప‌ర్ విల్లే మ‌రియు ఇత‌ర ప్రాంతాల్లో కూడా మ‌రిన్ని కేంద్రాల‌ను ప్రారంభించాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగుతోంది.

“గోదావ‌రి సాధించిన మ‌రియు సాధిస్తున్న ఈ ప్ర‌గ‌తి అంతా “యువ‌” బృందం మ‌రియు ఫ్రాంచైజీ య‌జ‌మానులు మ‌రియు ప్రామాణికమైన రుచుల (authentic food) ప్రియులు తొలి నుంచి అందిస్తున్న మ‌ద్ద‌తు వ‌ల్ల‌నే సాధ్య‌మైంది. వారు అందిస్తున్న విశేష‌మైన మ‌ద్ద‌తు ఫ‌లితంగానే గోదావ‌రి దిన‌దిన ప్ర‌వ‌ర్థ‌మానంగా ఎదుగుతోంది.” అని “టీం” గోదావ‌రి త‌ర‌ఫున తేజా చేకూరి (Teja Chekuri), జశ్వంత్ రెడ్డి ముక్కా (Jaswanth Reddy Mukka) స్ప‌ష్టం చేశారు.

“ప్ర‌తి ఒక్కరికీ సంతోష‌క‌ర‌మైన సెల‌వుల స‌మ‌యం మ‌రియు నోరూరించే నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు. ఈ సంవ‌త్సరం మా అనేక కేంద్రాల్లో బ్రాండ్ న్యూ మెనూను మా వినియోగ‌దారుల‌కు అందించ‌నున్నాం. దీంతోపాటుగా మా ప్ర‌యాణానికి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ను పేర్కొంటూ విశేష‌మైన క‌వ‌రేజీని అందించిన మిడియకు మేం ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాం “అని ఫ్రాంచైజీ య‌జ‌మానులే కాకుండా “గోదావ‌రి కోర్ టీం” లో భాగ‌స్వామ్యులు అయిన‌ వ‌రుణ్ మేడిశెట్టి (Varun Madisetty) మ‌రియు రాజామున‌గ (Raja Munaga) వెల్ల‌డించారు.

అంచెలంచెలుగా ఎదిగిన త‌మ “గోదావ‌రి” టీంకు గుర్తింపుగా …. “టీవీ9” చానెల్ ప్ర‌సారం చేసిన‌ కార్య‌క్ర‌మాన్ని ఈ లింక్ ద్వారావీక్షించ‌వ‌చ్చు: https://www.youtube.com/watch?v=pAnnDNt2X6A&t=17s

గోదావ‌రి ఈ సంద‌ర్భంగా త‌న నూతన‌ మ‌స్క‌ట్ అయిన “గుండ‌మ్మ అత్త‌” (“Gundamma Attha”) ను ఆవిష్క‌రిస్తోంది. ద‌క్షిణా భార‌త‌దేశ రుచుల ప్రామాణిక‌త‌కు మారుపేరుగా గోదావ‌రి కేంద్రాల వద్ద ఈ మ‌స్క‌ట్ కొలువుదీర‌నుంది.

భార‌త‌దేశంలో ఫ్రాంచైజీ కోసం ఆస‌క్తిగా ఉన్న‌వారు ఈ కింది పేర్కొన్న స‌మాచారం ద్వారా సంప్ర‌దించ‌వ‌చ్చు.
స‌త్య‌ (Mr. Satya)

FranchiseIndia@godavarius.com (or) Franchise@godavarius.com

+91-9611186181

www.GodavariUS.com

Press release by: Indian Clicks, LLC

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com