గోపీచంద్ టైటిల్ కొట్టేశారు

గోపీచంద్ – బి.గోపాల్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ఎప్పుడో విడుద‌ల కావాల్సిన ఈ సినిమా ఆర్థిక ప‌ర‌మైన కార‌ణాల వ‌ల్ల ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. ఈ దీపావ‌ళికి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసి, టైటిల్‌నీ క‌న్‌ఫామ్ చేయాల‌ని చిత్ర‌బృందం భావించింది. ఈ సినిమా కోసం `బ‌లం` అనే టైటిల్ ప‌రిశీలించారు కూడా. అదే టైటిల్‌ని ఫిక్స్ చేస్తార‌నుకొంటే.. ఆ టైటిల్ ని హృతిక్ రోష‌న్ లాగేసుకొన్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ న‌టిస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ … “కాబిల్” . ఈ చిత్రాన్ని తెలుగు లోనూ విడుద‌ల చేయ‌నున్నారు. తెలుగు వెర్ష‌న్‌కి బ‌లం అనే టైటిల్ పెట్టారు.
సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26 2017 న విడుదల అవుతుంది. ట్రైల‌ర్ ఈ దీపావ‌ళికి వ‌స్తుంది.

బ‌లం అనే టైటిల్ హృతిక్ తీసుకోవ‌డంతో ఇప్పుడు గోపీచంద్ సినిమా కోసం మ‌రో టైటిల్ వెదికే ప‌నిలో ఉంది చిత్ర‌బృందం. ఆర‌డుగుల బుల్లెట్‌, బుల్లెట్ అనే పేర్లు ప‌రిశీలిస్తున్నారు. ఇవి కాక గోపీచంద్ సెంటిమెంట్ ప్ర‌కారం సున్నాతో ముగిసే టైటిల్ కూడా అన్వేషిస్తున్నారు. దీపావ‌ళికి గోపీచంద్ కూడా టైటిల్ క‌న్‌ఫామ్ చేసే అవ‌కాశాలున్నాయి. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close