టీటీడీని చిక్కుల్లో పెడుతున్న గోవిందానంద..!

హనుమాన్ జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రేనని ప్రకటించేసుకున్న టీటీడీ… ఇప్పుడు అనూహ్యంగా ఆంజనేయుని జయంతిని కూడా జూన్ నాలుగో తేదీన ఖరారు చేసి నిర్వహించేసింది. దీనిపై హంపి కిష్కింధ ట్రస్ట్ … ట్రస్టీ గోవిందానంద చార్య మరోసారి టీటీడీపై విరుచుకుపడ్డారు. కొద్ది రోజుల నుంచి టీటీడీ జన్మస్థలంపై అటో ఇటో తేల్చుకోవాలనుకున్న ఉద్దేశంతో తిరుపతిలోనే మకాం వేసిన ఆయన తాజాగా.. హనుమాన్ జయంతిని టీటీడీ ఘనంగా నిర్వహించడంపై మండిపడ్డారు. టీటీడీ హనుమంతుడి జయంతి వ్యవహారం హాస్య ధారావాహికంలా ఉందని… హనుమంతుడిపై టీటీడీ ప్రచురించిన పుస్తకం లో ఇచ్చిన జయంతికి, ఇప్పుడు నిర్వహిస్తున్న తేదీలకు పొంతన లేదని లెక్కలు చూపించారు.

టీటీడీ చెప్పినట్టు శ్రావణ మాసం అంటే జులైలో జయంతి జరగాలని.. కానీ జూన్‌లోనే చేస్తున్నారని ఆయన విమర్శించారు. టీటీడీ పండితులు, వీసీ లు హనుమంతుడికి బర్త్ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్లు దీనికి సమాధానం చెప్పాలన్నారు. హనుమంతుడి జన్మస్థలంపై ఇంగ్లిష్‌లో బుక్ ప్రచురిస్తే.. టీటీడీ గుట్టు అందరికీ తెలిసిపోతుందన్నారు. హనుమాన్ జయంతిని దేశ వ్యాప్తంగా చైత్ర మాసంలో అంటే మార్చిలో చేస్తారని.. టీటీడీ సత్యాన్ని చెప్పకుండా అబద్ధాల పైన అబద్దాలు చెపుతోందని విమర్శించారు. ఇంతకు ముందు జపాలి తీర్థంలో పుట్టాడని .. ఇప్పుడు ఆకాశగంగలో పుట్టాడని అంటున్నారని.. ఇలా క్షణానికి ఒక మాట టీటీడీ చెప్పటం తగదనన్నారు. ఇప్పటికైనా శంకర, మద్వ, రామానుజ పెద్దలను టీటీడీ వెంటనే సంప్రదించాలని సూచించారు.

తను టీటీడీ పుస్తకాన్ని అంగీకరించినట్లుగా విశాఖ శారదా పీఠం ప్రచారం చేయడంపై మండిపడ్డారు.. ఆ పీఠం డూప్లీకేట్ పీఠమని.. శంకరాచార్యులు పెట్టిన శృంగేరి, బద్రి, పూరి, ద్వారక ఈ నాలుగుపీఠాలు, కంచి పీఠం మాత్రమే శంకర పీఠాలని స్పష్టం చేశారు. ఏ ఉద్దేశంతో శ్రీవారి కన్నా ఎక్కువగా ఆంజనేయుడికి ప్రచారం కల్పించాలని టీటీడీ ప్రయత్నిస్తుందో కానీ.. అది వివాదాస్పదం అవుతోంది. కిష్కింధ ట్రస్ట్ తాడో పేడో తేల్చుకోవాలనుకుంటోంది. ఇక గోవిందానందను టీటీడీ పట్టించుకోదని ఈవో జవహర్ రెడ్డి తేల్చేసారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close