రెండేళ్ల జైలు శిక్ష వేయనందుకు కేజ్రీవాల్ హ్యాపీ !

దేశంలో విచిత్రమైన పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ విద్యార్హతలు అడిగినందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు రూ. పాతిక వేల జరిమానా విధించించింది. దేశానికి ప్రధాని మోదీ. ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో చెప్పిన వాటి ప్రకారమే ఎక్కడ చదువుకున్నారో ఆధారాలు అడిగారు. సర్టిఫికెట్లు చూపించమన్నారు. ఇదే తప్పయిపోయింది గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి గారి. వెంటనే పిటిషన్ కొట్టేసి రూ. పాతిక వేలు జరిమానా వేశారు.

అయితే సూరత్ కోర్టు న్యాయమూర్తి కన్నా గుజరాత్ హైకోర్టు జడ్జి కి కాస్త విశాల హృదయం ఉన్నట్లే. ఎందుకంటే రెండేళ్ల జైలుశిక్ష వేసి ఉంటే.. కేజ్రీవాల్ ఈ పాటికి మాజీ సీఎం అయి ఉండేవారు. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. విద్యార్హత అడిగితే ఫైన్ వేస్తారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దేశంలో న్యాయం నాలుగు పాదాలా నడుస్తోందని సెటైర్లు వేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో చాలా కోర్టుల నుంచి వెలువడుతున్న నిర్ణయాలు .. విమర్శలకు కారణం అవుతున్నాయి.

గతంలో రాజకీయ కేసుల విషయంలో న్యాయస్థానాలు కాస్త సంయమనంతో ఉండేవి. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితి మారిపోయింది. రాహుల్ గాంధీకి వేసిన రెండేళ్ల శిక్ష తర్వాత ఈ పరిస్థితి మరింత ఎక్కువ అయింది. రాహుల్ కు శిక్ష పడిన వైనం దగ్గర్నుంచి అనేక అంశాలు పదే పదే చర్చకు వస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటి వ్యవస్థలకు మంచిదో కాదో ప్రజలకే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close