‘గుంటూరు కారం’.. వ‌రుస పార్టీలు

ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది ‘గుంటూరు కారం’. రివ్యూల సంగ‌తి ఎలా ఉన్నా, సంక్రాంతి సీజ‌న్ వ‌ల్ల‌… వ‌సూళ్లు మాత్రం బాగున్నాయి. మ‌హేష్ కెరీర్‌లో తొలి వారంతో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమా ఇది. పైగా మ‌హేష్ లుక్‌, త‌న క్యారెక్ట‌రైజేష‌న్ ఫ్యాన్స్‌కు న‌చ్చాయి. మ‌హేష్ కొత్త‌గా ఉన్నాడ‌న్న ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. ఈ రిజ‌ల్ట్ ప‌ట్ల‌.. మ‌హేష్ ఆనందంగానే ఉన్నాడు. అందుకే పార్టీ మూడ్‌లోకి వ‌చ్చేశాడు. సోమ‌వారం రాత్రి మ‌హేష్… త‌న‌ ఇంట్లో ‘గుంటూరు కారం’ టీమ్ కి పార్టీ ఇచ్చాడు. ఈ సినిమాలో ప‌ని చేసిన కొంత‌మంది న‌టీన‌టులు ఈ పార్టీలో మెరిశారు. ఈరోజు మ‌రికొంత మంది టెక్నీషియ‌న్ల‌కు పార్టీ ఇవ్వ‌బోతున్నాడు. రేపు.. దిల్ రాజు వంతు. ‘గుంటూరు కారం’ టీమ్ మొత్తానికి హైద‌రాబాద్ లో దిల్ రాజు గ్రాండ్ పార్టీ ఇవ్వ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాని నైజాంలో దిల్ రాజు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఓ సినిమా పూర్త‌యిన వెంట‌నే టీమ్ కి పార్టీ ఇవ్వ‌డం త‌మిళ హీరోలకు సెంటిమెంట్. ఆ సంప్ర‌దాయం తెలుగు హీరోలూ పాటించ‌డం శుభ ప‌రిణామ‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close