ఇతనిలో ఫైరు… మన వేదనని మనమే వింటున్నట్టు వుంటుంది

పవన్ కల్యాణ్ మాటలన్నీ మనకితెలిసినవే అనిపిస్తుంది. అయినా విసుగురాదు. మన వేదనని మనమే వింటున్నట్టు వుంటుంది.మన ఆవేశాన్ని మనమే చూస్తున్నట్టు వుంటుంది. మన చుట్టూ వున్న దుర్నీతిని మనమే తొలగిస్తున్నట్టు అనిపిస్తుంది. అతని మీద ఒక నమ్మకం హృదయం నుంచి ప్రవహిస్తున్నట్టు వుంటుంది.

జనంలో ఆక్రోశాలు, ఆవేదనలు, ఉద్వేగాలు, సమాధానంలేని ప్రశ్నల్ని ముప్పై ఏళ్ళక్రితం ఎన్ టి రామారావు హృదయం నుంచి ప్రతిబింబించారు. రాజకీయ సాంప్రదాయాలను లాంఛనాలను విచ్ఛినం చేస్తూ అన్ని దుర్నీతులకూ కాంగ్రెస్ మీద నిప్పులు చెరిగిన ఎన్ టి ఆర్ ని నిజజీవితంలోనూ హీరో అయ్యారు. అపుడు ప్రజలు తమను ఆయనలో చూసుకున్నారు. ఆ ఐడెంటిటీ ఆయనకు నాయకత్వాన్ని కట్టబెట్టింది.

రాజకీయాల్లో పాలనలో సొంత కుటుంబంలో ఎన్ టి ఆర్ సాఫల్యాలు వున్నాయి. వైఫల్యాలు వున్నాయి. ఆయన ముగింపు దయనీయమే …అయినా తెలుగునాట ఎన్ టి ఆర్ కు మించిన ప్రజానాయకుడు రాలేదు.

పవన్ కల్యాణ్ – ఎన్ టి ఆర్ ని తలపిస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ ఆర్ధిక, సామాజిక నేపధ్యాలు పోలికలేనంత మారిపోయాయి. మౌలికమైన రాజకీయనేపధ్యం దాదాపు మారలేదు. ఈ ప్రమేయాలన్నటినీ పరిగణనలోకి తీసుకుని చూసినపుడు మళ్ళీ ఒక ప్రజానాయకుడు ఉద్భవించాడన్న భావన కలుగుతోంది.

రాజకీయాల్లోకి వస్తారని ఊరించి ఊరించి అపూర్వ జనసందోహంతో రాజకీయ ప్రవేశం చేసిన చిరంజీవి ఉపన్యాసం తొలిసభలోనే నిరుత్సాహపరచింది ఏళ్ళతరబడి ఆయన మీద విపరీతంగా పెరిగిపోయిన ఎక్స్ పెక్టేషన్ అందుకు కారణం కావచ్చు

సినిమా వాళ్ళకు రాజకీయాలేంటి? మొఖాలకు పూసుకునే రంగులు ఎంతకాలం నిలుస్తాయి? వగైరా సమస్యలను అపుడు ఎన్ టి ఆర్ ఎదుర్కొన్నారు. ఇతను తెలుగుదేశానికి ఉపయోగపడుతున్నాడా, బిజెపికి ఉపయోగ పడుతున్నాడా అన్న అనుమానానాల్ని ఇపుడు పవన్ ఎదుర్కొంటున్నాడు.

రాజకీయ సాంప్రదాయాలకు పద్ధతులకు మర్యాదలకు భిన్నంగా ప్రజాజీవితంలోకి వచ్చే వారిమీద విమర్శలు అతితీవ్రంగా వుంటాయి.

ఎన్ టి ఆర్ ఉపన్యసించి వెళ్ళిపోయాక ఆ ప్రాంతంలో ఒక రోజంతా విమర్శలు చర్చలు మద్దతు మాటలూ వినబడేవి. ఇపుడు అవన్నీ టివిల్లోనే, సోషల్ మీడియాలోనే కనబడుతున్నాయి.

అప్పట్లో నాయింట్లో నేనూ నా భార్యా చాలాసార్లు ఎన్ టి ఆర్ గురించి మాట్లాడుకున్నాం. ఈయన గెలిస్తే బాగుండును అనుకునే వాళ్ళం.

ఎన్ టి ఆర్, పవన్ – ఈ ఇద్దరి ఉపన్యాసాలూ విన్నంత సేపూ వేరువేరు సినిమాల్లో వారే చెప్పిన ఈ డైలాగులన్నీ మనకితెలిసినవే అనిపిస్తుంది. అయినా విసుగురాదు. మన వేదనని మనమే వింటున్నట్టు, మన ఆవేశాన్ని మనమే చూపిస్తున్నట్టు, మన చుట్టూ వున్న దుర్నీతిని మనమే తొలగిస్తున్నట్టు అనపిస్తుంది.

అయితే-

రాజశేఖరరెడ్డి చనిపోయింది మొదలు రాష్ట్రవిభజన జరిగేదాకా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాల్లో ప్రజలమైన మనకి ఉన్నది ఉన్నట్టు చూసే శక్తి నశించింది.

మనం రాజకీయపార్టీల ఒట్లకు వేటలమైపోయాం. మనకితెలిసో తెలియకో కులం, మతం, ప్రాంతం కళ్ళజోళ్ళుతొడిగేసుకున్నాం. ఎవరేమిచెప్పినా వినకముందే అనుమానాల్ని పెంచేసుకుని ఆదిశగానే ప్రచారాలు కూడా చేసేస్తున్నాం

ఎన్ టి ఆర్ హయాంలో కూడా ఇది చాలా పరిమితంగా జర్నలిస్టులు, రాజకీయవర్గాలు, సామాజిక వేత్తల్లోనే వుండేది. ప్రజలు మౌనంగా విని నిర్ణయానికి వచ్చేవారు. 24 గంటల న్యూస్ టివిల వల్ల, సోషల్ మీడియావల్లా ప్రజలకు ఇపుడు రెండు పాత్రలు సంక్రమించాయి. ఒకటి ఎవరికి వారు జీవించే సొంత పాత్ర. రెండు ఎవరికితోచిన అహగాహనను ఇతరులకు చెప్పే మీడియా పాత్ర. ఇందులో ప్రతివారూ శ్రోతలే. ప్రతివారూ ఉపన్యాసకులే.

ఈ గందరగోళంలో పవన్ నే కాదు ఎవరినీ నమ్మలేని స్ధితి … నమ్ముకున్న నాయకుల్నీ అనుమానించే స్ధితి తప్పడం లేదు.

అసంఖ్యాకమైన సినీ అభిమానులు వున్న అమితాబ్ బచ్చన్, చిరంజీవి మొదలైన వారు సఫలమైన లేదా విఫలమైన రాజకీయ నాయకులుగానే వుండిపోయారు. చివరిలో రాజకీయనాయకుడిగా ఎన్ టి ఆర్ విఫలమైనప్పటికీ ఆయన ఎప్పటికీ గొప్ప ప్రజానాయకుడే! ప్రజల సుఖదుఃఖాలని కష్టనష్టాలనీ అనుభూతి చెంది ఆవేశాలు ఉద్వేగాలు ఉద్రేకాలతో వాటిని నోటిమాటలతోగాక హృదయపూర్వకంగా ప్రతిబిబింపచేయడం వల్లే ఆయన నాయకులందరిలో ఉన్నతుడయ్యారు.

పవన్ కళ్యాణ్ కూడా అంతటినాయకుడే అనిపిస్తున్నాడు. ప్రత్యేక హోదావిషయంలో వెంకయ్యనాయుడు వల్ల కానిది, చంద్రబాబు చెయ్యలేనిది, పవన్ కల్యాణ్ వల్ల కదిలింది…

ఇది ప్రశ్నించడంలో నిజాయితీకి వున్న శక్తి !

భ్రమలేని నమ్మకం ఇచ్చిన వారిని ప్రజలు ప్రేమాస్పదంగా గౌరవించుకుంటారు.

భవిష్యత్తులో ఏం జరుగుతుందోకాని పవన్ కల్యాణ్ కలవరింతంతా హృదయపూర్వకమేనని నమ్మకం కలుగుతోంది.

HAPPY BIRTHDAY PAVAN ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close