దుబ్బాకలో కాంగ్రెస్‌ను లెక్కలోకి తీసుకోని హరీష్ రావు..!

దుబ్బాకలో టీఆర్ఎస్‌కు లక్ష ఓట్ల మెజార్టీ సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్న హరీష్ రావు అసలు కాంగ్రెస్ పార్టీని లెక్కలోకి తీసుకోవడం లేదు. మరుమూల గ్రామాల్లోకి వెళ్లి బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. అది కూడా జాతీయ అంశాలపై విమర్శలు చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలు మార్చారని.. రైతుల్ని మోసం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. వ్యవసాయ చట్టాలపై తెలంగాణలో ఎక్కడా పెద్దగా చర్చ జరగలేదు. ఆ అంశంపై రైతుల్లోకి పెద్దగా వెళ్లలేదు. అయినప్పటికీ హరీష్ రావు వాటినే పెద్ద పెద్ద అంశాలుగా రైతులకు చెబుతున్నారు. ఇక తాము రైతుల కోసం.. కేందరాన్ని ఢీ కొడుతున్నామని చెప్పుకుంటున్నారు. దానికి విద్యుత్ మీటర్ల అంశాన్ని బలంగా చూపిస్తున్నారు. ఏపీ ఆ మీటర్లను పెడుతోంది.. తాము పెట్టడం లేదని చెబుతున్నారు.

హరీష్ రావు కాంగ్రెస్ పార్టీని ఎక్కడా పెద్దగా విమర్శించడం లేదు. ఆయన వ్యూహాత్మకంగానే కాంగ్రెస్‌ను బలమైన ప్రత్యర్థిగా గుర్తించడానికి ఇష్టపడటం లేదన్న చర్చ జరుగుతోంది. బీజేపీనే ముందు పెట్టడం ద్వారా… టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లలో భారీ చీలిక తీసుకు రావొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. అందుకే.. టార్గెట్ బీజేపీ అన్నట్లుగా.. ఇతర అంశాల్లోనూ వ్యూహాత్మకంగా రాజకీయాలు చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. లక్ష ఓట్ల మెజార్టీని సాధిచాలంటే.. టీఆర్ఎస్‌కు ఓట్లు రావడమే కాదు.. ప్రత్యర్థుల ఓట్లను చీల్చాలన్నది హరీష్ వ్యూహం అంటున్నారు.

రాజకీయాల్లో.. హరీష్ వ్యూహాలను అంచనా వేయడం సాధ్యం కాదు. అందుకే.. ప్రధానంగా టాస్క్‌లన్నీ కేసీఆర్… హరీష్‌కే అప్పగిస్తూంటారు. మెదక్ జిల్లా మంత్రిగా ఉన్నారు కాబట్టి సహజంగానే దుబ్బాక ఎన్నికల బాధ్యత హరీష్ పై పడింది. తన వ్యూహాలు ఎంత బాగా వర్కవుట్ అవుతాయో.. నిరూపించాల్సిన అవసరం ఇప్పుడు హరీష్ రావుపై పడింది. తన పని తనాన్ని నిరూపించుకునేందుకు పక్కాగా స్కెచ్ వేసుకుంటూ వెళ్తున్నారు హరీష్. అందుకే కాంగ్రెస్‌ను ఆయన గుర్తించడానికి సిద్ధపడటం లేదంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close