రాజ‌శేఖ‌ర్ కారు బోల్తా.. తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

ప్ర‌ముఖ న‌టుడు రాజ‌శేఖ‌ర్ కారు ప్ర‌మాదానికి గుర‌య్యారు. మంగ‌ళ‌వారం రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా ఔట‌ర్ రింగు రోడ్డు ద‌గ్గ‌ర కారు బోల్తా కొట్టింది. స‌మ‌యానికి ఎయిర్ బ్యాగ్స్ తెర‌చుకోవ‌డంతో రాజ‌శేఖ‌ర్‌కి ప్ర‌మాదం త‌ప్పింది. ఎలాంటి గాయాలూ లేకుండానే ఆయ‌న బ‌య‌ట‌ప‌డ్డారు. కారు ముందు భాగం మాత్రం నుజ్జు నుజ్జు అయ్యింది. ఆ స‌మ‌యంలో కారులో రాజ‌శేఖ‌ర్ ఒక్క‌రే ఉన్నారు. స్థానికులు కారులో ఉన్న రాజ‌శేఖ‌ర్‌ని గుర్తించి, వాళ్లు బ‌య‌ట‌కు లాగారు. వెంట‌నే పోలీసుల‌కు, కుటుంబ స‌భ్యుల‌కూ స‌మాచారం అందించారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఆ స‌మ‌యంలో రాజ‌శేఖ‌ర్ మ‌ద్యం సేవించారా?

సాధార‌ణంగా ఓవ‌ర్ స్పీడు, మ‌ద్యం తాగి కారు న‌డ‌ప‌డం వ‌ల్ల ఇలాంటి ప్ర‌మాదాలు జ‌రుగుతుంటాయి. పోలీసులు ఈ కోణంలోంచే కేసుని ద‌ర్యాప్తు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. రాజ‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం ఆయ‌న ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. పోలీసులు రాజ‌శేఖ‌ర్ ర‌క్త న‌మూనాల‌ను తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దాంతో పాటు సీసీ కెమెరా ఫుటేజీనీ సేక‌రిస్తున్న‌ట్టు స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close