‘రంగస్థలం’ వేడుకలో చమక్కులు…

రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌, సీవీయం (మోహన్‌) నిర్మించిన ‘రంగస్థలం’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ఆదివారం రాత్రి విశాఖలో జరిగింది. అందులో హైలైట్స్…

సురేఖ కనీళ్ళు పెట్టుకుంది: చిరంజీవి

రామ్‌చరణ్‌ స్టార్‌ స్టేటస్‌ని పెంచే సినిమా ఇది. నటుడిగా తను ఓ మెట్టు ఎక్కే సినిమా. నాకు ‘ఖైదీ’ ఎలాంటి సినిమాగా నిలిచిందో… చరణ్‌కి ఇది అలాంటి సినిమా అవుతుంది. ఇది సత్యం. సుకుమార్‌ ఇలాంటి ఛాన్స్ చరణ్‌కి ఇచ్చినందుకు నటుడిగా ఈర్ష్య పడుతున్నా.. తండ్రిగా గర్వపడుతున్నా. అవార్డుల కోసం సినిమాలు తీయరు. కాని ఈ ‘రంగస్థలం’ అవార్డులనూ అందుకుంటుంది. జాతీయ స్థాయిలోనూ అవార్డులు వస్తాయి. ఒకవేళ అవార్డులు రాకపోతే అన్యాయం జరిగినట్టే. హీరోకి వినికిడి లోపం ఉంటే ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అనుకున్నా. సుకుమార్ ఆ పాత్రను ఎమోషనల్‌గా, కామెడీగా తీశాడు. తెలంగాణ బిడ్డ అయిన చంద్రబోస్ గోదావరి గడ్డ మీద ఉండే పల్లె పదాలను ఎంత అందంగా రాశాడో… ఆయన పెన్నుకి నా వెన్ను వంచి నమస్కరిస్తున్నా. నేపథ్య సంగీతం లేకుండా సినిమా చూశా. గుండెలను పిండేసింది. సురేఖ అయితే సినిమా చూశాక, చరణ్ ఇంటికి రాగానే కనీళ్ళు పెట్టుకుంది.

నాపై నాకు గౌరవం పెరిగింది: రామ్‌చరణ్‌

మాది పల్లెటూరి నుంచి పట్టణం వచ్చిన ఫ్యామిలీ అయినప్పటికీ ఎక్కువగా పల్లెటూళ్ళు వెళ్ళలేదు. నెల్లూరులో తాతయ్యగారి ఇంటికి రెండు మూడుసార్లు, ‘ఆపద్బాంధవుడు’ షూటింగ్ అప్పుడు పూడిపల్లి ఒకటిసారి వెళ్ళా. ఈ ‘రంగస్థలం’తో మళ్ళీ ఊళ్ళను నాకు పరిచయం చేసిన దర్శకుడు సుకుమార్‌కి థ్యాంక్స్. ఎందుకు సిటీల్లో ఉంటున్నామా? అనిపిస్తుంది. సుకుమార్ గారు నాకు ఓ కొత్త చరణ్‌ని చేశారు. నాకు ఆ చరణ్ బాగా నచ్చాడు. ఈ సినిమాతో నాపై నాకు గౌరవం పెరిగింది.అమ్మానాన్న, అభిమానులు గర్వపడే సినిమాను సుకుమార్ ఇచ్చాడు.

చరణ్… ఫస్ట్ టేక్… క్లాప్స్: సుకుమార్

దర్శకుడు అనేవాడు టెన్నిస్ ప్లేయర్ లా ఒక్కడు కాడు. సమిష్టి కృషితో చేసిన సినిమా ఇది. ముఖ్యమంత్రి పదవి కంటే చిరంజీవి పదవి గొప్పది, ప్రత్యేకం. అటువంటి చిరంజీవి ఇంటికి పిలిచి సినిమా గొప్పదని చెబుతుంటే… ఆయన మాటలు వినడానికి పక్కన ఎవరూ లేరని బాధపడ్డా. సాధారణంగా నా సినిమాల్లో డైలాగులు సెట్స్‌లో వేడి వేడిగా అప్పటికప్పుడు వండుతా. అలా రెడీ చేసిన డైలాగులతో మామూలుగా చరణ్ తో ఫస్ట్ డే ఒక సీన్ తీయాలనుకున్నా. అతడి యాక్టింగ్ చూసి సెట్స్‌లో అందరూ క్లాప్స్ కొట్టారు. అలా ఎవరైనా క్లాప్స్ కొడితే నాకు భయం. సెకండ్ టేక్ ఆడలేనని. కాని నేను కూడా క్లాప్స్ కొట్టాను. చరణ్ నటనలో స్వచ్ఛత వుంటుంది. సమంత అద్భుతంగా నటించింది. ద్వందార్థం తీసుకోకపోతే… ఆమెను నా సినిమాలు చేయాలని అనుకుంటున్నా. దేవిశ్రీ మూడున్నర రోజుల్లో మ్యూజిక్ సిట్టింగ్స్ కంప్లీట్ చేశాడు. సెట్స్‌లో ఎన్ని గొడవలు పడ్డా.. రత్నవేలు నా ఫ్రెండ్. బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ ఇచ్చాడు.

చిరంజీవిగారికి ‘స్వయంకృషి’… చరణ్‌కి ‘రంగస్థలం’: సమంత

సుకుమార్‌ గారు రామలక్ష్మి పాత్ర చెబుతున్నప్పుడు ఆయన కళ్లును మాత్రమే చూశా. ఆ పాత్రను ఆయన ఎంత ప్రేమించారో ఆ కళ్ళలో కనబడింది. ‘ఎంత సక్కగున్నావే…’ పాటతో దేవిశ్రీ నన్ను రామలక్ష్మి చేశారు. చిరంజీవిగారికి ‘స్వయంకృషి’ ఎలాగో… రామ్ చరణ్‌కి ‘రంగస్థలం’ అలా అవుతుంది.

నా పంట పండింది: చంద్రబోస్

పాటల రచయితగా నా 23 ఏళ్ళ ప్రయాణంలో చిరంజీవిగారి మాటలతో నా జన్మ ధన్యమైంది. తెలుగు భాష సొగసుని శ్రోతలకు అందించే నా ప్రయత్నంలో కొన్నిసార్లు పువ్వులు, ఇంకొన్నిసార్లు పిందెలు, కాయల్ని ప్రేక్షకులకు అందించాను. ‘రంగస్థలం’తో మాత్రం నా పంట పండింది.

‘రంగస్థలం’తో తీరింది: దేవిశ్రీ ప్రసాద్

గ్రామీణ నేపథ్యంలో జానపద సంగీతంతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ‘రంగస్థలం’తో అది తీరింది. సుకుమార్‌ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో వస్తాడు. అందువల్ల, నాకూ కొత్త పాటలు ఇచ్చే అవకాశం దొరుకుతోంది.

చరణ్‌కు మాత్ర‌మే అత్త‌ను: అనసూయ

ఈ సినిమాలో రంగమ్మ అత్త పాత్ర చేశా. అత్త పాత్ర అనగానే అందరూ సమంతకు అమ్మ అనుకుంటున్నారు. కాని కాదు. నాది రామ్ చరణ్‌కు మాత్రమే అత్త పాత్ర. మొదట ఈ పాత్ర చేయనని గోల చేశా. సుకుమార్ గారు నన్ను కన్వీన్స్ చేశారు.

చరణ్ విశ్వరూపం చూస్తారు: నిర్మాత నవీన్

‘రంగస్థలం’లో రామ్‌చ‌ర‌ణ్‌గారి విశ్వ‌రూపం చూస్తారు. ఆయనకు ఈ సినిమా చిరంజీవిగారి ‘ఖైదీ’ లాంటి సినిమా అవుతుంది. మా సంస్థలో నిర్మించిన మూడు సినిమాలకు దేవిశ్రీ సంగీతం అందించారు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాం. మాకు ఈ సినిమా రావడానికి కారణమైన సుకుమార్ గారికి థ్యాంక్స్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close