ఒకొక్క‌డితో కాదు… ఒకేసారి వంద‌మందితో ఎన్టీఆర్‌!

ఒకొక్క‌డినీ కాదు షేర్ ఖాన్‌… ఒకేసారి వంద మందిని పంపు
– మ‌గ‌ధీర‌లోని పాపుల‌ర్ డైలాగ్ ఇది. ఇప్ప‌టికీ ఏదో ఓ రూపంలో వినిపిస్తూనే ఉంది. వంద మందితో చ‌ర‌ణ్ ఢీ కొట్టిన ఆ ఫైట్… మ‌గ‌ధీర కే హైలెట్. ఇప్పుడు అలాంటి ఫైట్ RRR లోనూ ఉంది. అయితే ఈసారి.. ఆ వంద‌మందితో త‌ల‌ప‌డేది రామ్ చ‌ర‌ణ్ కాదు. ఎన్టీఆర్‌.

ఆర్‌.ఆర్‌.ఆర్‌లో ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ ఉంది. అందులో వంద‌మంది బ్రిటీష‌ర్ల‌తో.. ఎన్టీఆర్ త‌ల‌ప‌డే స‌న్నివేశం ఉంది. ఈయాక్ష‌న్ సీన్‌.. ఆర్‌.ఆర్‌.ఆర్‌కే హైలెట్ గా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఈ ఫైట్ కోసం ఏకంగా 20 రోజులు క‌ష్ట‌ప‌డింద‌ట చిత్ర‌బృందం. ఆర్‌.ఆర్‌.ఆర్ ని ఖ‌రీదైన ఎపిసోడ్ల‌లో ఇదే ప్ర‌ధ‌మ స్థానంలో నిల‌వ‌బోతోంద‌ని స‌మాచారం. అస‌లే జ‌క్క‌న్న యాక్ష‌న్ ఎపిసోడ్ల‌ని ఓ రేంజ్ లో తీర్చిదిద్దుతాడు. యాక్ష‌న్ ఎపిసోడ్ కి ముందు.. ఎమోష‌న్ ని పిండేస్తాడు. ఈ సీన్‌లోనూ అదే జ‌ర‌గ‌బోతోంద‌ని, టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే ఇది ఖ‌రీదైన ఫైట్ కాబోతోంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close