కాంగ్రెస్, బీఆర్ఎస్ కన్నా బీజేపీ టిక్కెట్లకే ఫుల్ డిమాండ్ !

తెలంగాణ బీజేపీలో ఈ సారి టిక్కెట్ల కోసం భారీ పోటీ నెలకొంది. తెలంగాణలో బీజేపీలో చేరేందుకు పలు పార్టీల నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు ఒకరి కంటే ఎక్కువ బలమైన నేతలు పోటీ పడుతున్నారు. తెలంగాణలో బీజేపీకి నాలుగు ఎంపీ సిట్టింగ్ స్థానాలున్నాయి. వీటిలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధినేత జి కిషన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. దీంతోపాటు కరీంనగర్ ఎంపీ సీటును బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కు, నిజామాబాద్ పార్లమెంటు సీటును ప్రస్థుత సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు ఖరారు చేశారు.

మరో సిట్టింగ్ అయిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అభ్యర్థిత్వాన్ని మాత్రం బీజేపీ పెండింగులో పెట్టింది. చేవేళ్ల సీటును గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖమ్మం నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు, భువనగిరి సీటును మాజీ బీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కు ఖరారు చేసిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. మహబూబ్ నగర్ , మల్కాజిగిరి వంటి చోట్ల టిక్కెట్ కోసం గట్టి పోటీ నెలకొంది. అయితే బలమైన నేతలు వస్తే చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలు అయిన బీబీ పాటిల్, రాములు బీఆర్ఎస్ చేరిపోయారు.

చేవెళ్లే, మహబూబ్ నగర్, ఖమ్మం ఎంపీలుకూడా తమకు టిక్కెట్లు ఇస్తే వస్తామని బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఖమ్మం తప్ప మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని పరిశీలించే పరిస్థితి లేదు. మరికొంత మంది నేతలు బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీకి నాలుగు సిట్టింగ్ స్థానాలుండగా, ఈ సారి ఎన్నికల్లో వీటి సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణలోని 12 ఎంపీ సీట్లపై గురి పెట్టిన కమలనాథులు దీనికి అనుగుణంగా బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించాలని నిర్ణయించారు. దీనికోసం ఇతర పార్టీల నుంచి నేతలను పార్టీలోకి తీసుకునేందుకు వెనుకాడటం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close