క్రైమ్: హైక్లాస్‌ వ్యభిచారానికి కేరాఫ్ హైదరాబాద్ స్టార్ హోటళ్లు..!

నటులు హైదరాబాద్ వారు కాదు.. విటులు కూడా హైదరాబాద్ వారు కాదు. కానీ.. బిజినెస్‌కు మాత్రం హైదరాబాదే సేఫ్ అనుకుంటున్నారు.. సెక్స్‌రాకెట్‌ను నిర్వహించేవాళ్లు. అందుకే ఎక్కడెక్కడి విటుల్నో… ఎక్కకెక్కడి నటుల్నో విమానాల్లో హైదరాబాద్‌కు తీసుకువచ్చి స్టార్ హోటళ్లలోనే వ్యవహారాలు నడిపించేస్తున్నారు. రెండు రోజుల కిందట పట్టుబడిన భోజ్‌పురి నటి, ఆమెతో ఉన్న విటుడు ఇద్దరికి హైదరాబాద్‌లో సంబంధం లేదు. విటుడు హర్యానా ప్రభుత్వ ఉద్యోగి. ఆమె భోజ్‌పురి నటి. కానీ ఈ ఇద్దరిని కలిపిన బ్రోకర్ మాత్రం.. హైదరాబాద్ వ్యక్తే. హైదరాబాద్‌ స్టార్ హోటళ్లలో ఇలాంటి వ్యభిచారం కేసులు బయటపడటం కొత్తేమీ కాదు.

కొద్ది రోజుల క్రితం.. రెండు ప్రముఖ హోటళ్లపై టాస్క్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో ఇద్దరు యువతులు దొరికారు. ఇద్దరూ యాక్టర్లే. ముంబయికి చెందిన మనీష్ ఖండేలా అనే వ్యక్తి.. తాజ్‌డెక్కన్ లో మకాం వేసి మరీ.. హీరోయిన్లతో వ్యాపారం చేయడానికి ప్రయత్నించారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేసి పట్టేసుకున్నారు. కోల్ కతాకు చెందిన బెంగాలీ సీరియల్స్‌లో నటించే ఓ నటి కూడా ఇలాగే దొరికిపోయింది. ఇక కొత్త బంగారు లోకం హీరోయిన్… శ్వేతాబసు ప్రసాద్ దొరికిపోయిన వైనం.. పెద్ద సంచలనం అయింది. ఆమె దొరికింది.. సెవన్ స్టార్ హోటల్లో కావడం గమనార్హం.

సినిమా తారలపై సామాన్యంగా ప్రజల్లో క్రేజ్ ఉంటుంది. ఈ క్రేజ్ ధనవంతులకూ ఉంటుంది. దాన్ని క్రేజ్ చేసుకునేందుకు బ్రోకర్లు రంగంలోకి దిగుతున్నారు. స్టార్ హోటళ్లలో అయితే.. పట్టుబడే అవకాశం ఉండదని.. చాలా మంది నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు పోలీసులు… స్టార్ హోటళ్లపైనా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. డెకాయ్ ఆపరేషన్లు చేసి.. ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. దాంతో సంచలనాత్మక కేసులు బయట పడుతున్నాయి. పోలీసులు కూడా.. ఇలాంటి ఆపరేషన్లకు కావాల్సింతగా ప్రచారం వస్తూండటంతో… వీటీపై దృష్టి పెడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close