చిట్టిబాబు పాత్ర బ‌న్నీ చేస్తే..??

‘రంగ‌స్థ‌లం’ సినిమాకి వంద మార్కులేస్తే.. అందులో 70 రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న‌కే ప‌డిపోతున్నాయి. చిట్టిబాబుగా చిత‌గ్గొట్టేశాడు చ‌ర‌ణ్‌. త‌న కెరీర్‌లో అత్యున్న‌త ప్ర‌తిభ క‌న‌బ‌రిచాడు. మ‌రి ఇదే పాత్ర‌ని అల్లు అర్జున్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ ప్ర‌శ్న‌కు బ‌న్నీ కూడా స్పందించాడు. ”ప్ర‌తీ న‌టుడిలోనూ ఓ యునిక్‌నెస్ ఉంటుంది. ఓ పాత్ర‌ని ఒక్కొక్క‌రు చేస్తే ఒక్కోలా ఉంటుంది.చిట్టిబాబు పాత్ర‌ని చ‌ర‌ణ్ చేస్తే.. షాకైపోయారు అంతా. ఆ షాకింగ్ వాల్యూ మిగిలిన హీరోలెవ‌రు చేసినా రాదు. చిట్టిబాబు పాత్ర‌లో చ‌ర‌ణ్ త‌ప్ప ఇంకెవ్వ‌రూ క‌నిపించ‌లేదు. ఆ పాత్ర త‌న కోస‌మే పుట్టింది” అని కితాబిచ్చాడు. ధృవ‌లోనూ చ‌ర‌ణ్ త‌న‌కు బాగా న‌చ్చాడ‌ని, ఆ సినిమా కోసం బాడీ పెంచిన విధానం, క‌ష్ట‌ప‌డిన తీరు బాగా న‌చ్చాయ‌ని, అయితే మ‌గ‌ధీర త‌ర‌వాత అంత‌టి ఇంటెన్సిటీ ఉన్న పాత్ర చిట్టిబాబు అని, త‌మిళ సినిమాల్లో చూపించే ‘రా’నెస్ తెలుగులో చూపిస్తే సినిమా ఆడ‌వ‌ని చాలామంది చెప్పేవార‌ని, కానీ ఈ సినిమా అది త‌ప్పు అని నిరూపించింద‌న్నాడు బ‌న్నీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.