శ్వేత : వైసీపీ మరోసారి ఓడితే కాంగ్రెస్‌కు పునర్జన్మ లభిస్తుందా..?

ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ తొలి సంతకం.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై ఫైలుపైనే…అనేది.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఏకైక నినాదంగా మారింది. రాష్ట్ర విభజనతో… కదిలిపోయిన కూసాలను.. కాస్తంతైనా నిర్మించుకోవడానికి.. ప్రత్యేకహోదా అంశం.. కాంగ్రెస్ పార్టీకి ఓ టానిక్ లా మారింది. పార్లమెంట్ లో ఐదేళ్లు కాదు.. పదేళ్లు కావాలంటూ.. డిమాండ్ చేసిన బీజేపీనే… ప్రత్యేకహోదాను ఇవ్వలేదు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ ప్రచారాస్త్రం చేసుకుంది. తామ వస్తే ఇస్తామంటూ ప్రజల్లోకి వెళ్తోంది. ప్రత్యేకహోదాపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ హోదా భరోసా యాత్ర ప్రారంభించింది.

హోదా అంశంతో కాంగ్రెస్‌కు ఊపిరి..!

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రత్యేకహోదా ఎన్నికల అంశం. బీజేపీ నమ్మించి మోసం చేసిందనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. సగటు ఆంధ్రుడు.. ప్రధాని నరేంద్రమోదీపై ఆగ్రహంతో ఉన్నాడు. తదుపరి ప్రధానిగా.. మోదీతో పోలిస్తే రాహుల్ గాంధీకే.. ఏపీలో మద్దతు ఎక్కువ ఉంది. ఈ సానుకూల వాతావరణాన్ని… కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మోదీ మళ్లీ ప్రధాని అయితే.. ప్రత్యేకహోదా ఇవ్వరు కాబట్టి… చాయిస్ రాహులేనని.. ఏపీ ప్రజలకు బలంగా చెప్పాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఎంత ఎక్కువగా.. హోదా అంశాన్ని… ప్రజల్లోకి తీసుకెళ్తే.. కాంగ్రెస్ పార్టీ అంత బలపడుతుందని.. ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. కనీసం.. నాలుగు, ఐదు శాతం ఓట్ బ్యాంక్ ని పునరుద్ధరించుకోగలిగితే… భవిష్యత్ పై ఆశలు కలుగుతాయని వారి నమ్మకం. ఆ దిశగా… ప్రయత్నాలు చేస్తున్నారు..

కాంగ్రెస్ ఓటు బ్యాంకుల్ని తిరిగి ఆకర్షించే ప్రయత్నం..!

కాంగ్రెస్ పార్టీ.. నాలుగైదు శాతం ఓటు బ్యాంక్ పునరుద్ధరించుకోగలిగితే.. ఏపీ రాజకీయాల్లో మాత్రం ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు రావడం ఖాయమనే అంచనాలున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత .. కాంగ్రెస్ పార్టీ స్థానంలోకి వైసీపీ వచ్చింది. ఆ పార్టీకి చెందిన ప్రధాన ఓటు బ్యాంకులన్నీ వైసీపీకి మళ్లాయి. ఇప్పుడు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే… జగన్ తీరు నచ్చని… సంప్రదాయక కాంగ్రెస్ ఓటర్లు మళ్లీ ఆ పార్టీ వైపు మళ్లితే.. ప్రధానంగా వైసీపీకే నష్టం జరుగుతుందనే అంచనా ఉంది. పైగా.. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు బలంగా చీలిపోయేందుకు కాంగ్రెస్ కారణం అవుతుంది. హోదా అంశం ఆధారంగా ఓటు వేసే ఓటర్లు.. అయితే మోదీ.. లేకపోతే రాహుల్ అన్నట్లుగా ఉంటారు కానీ.. ఈ ఓట్లు అడ్వాంటేజ్ అవుతాయి. ఎటు తిరిగి ఎటు చూసినా… కాంగ్రెస్ ఎదుగుదల… వైసీపీకి నష్టమేనని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో హోదాపై.. .గట్టిగా మాట్లాడకపోవడం వైసీపీకి నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ మరింత దూకుడుతో ఉంటోంది.

వైసీపీ ఈ సారి ఓడిపోతే పార్టీ ఉనికి ఉంటుందా..?

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే.. ఆ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కానీ.. ఆ పార్టీ నేతృత్వంలోని… సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. జగన్మోహన్ రెడ్డి పార్టీని కాపాడుకోవడం అంత తేలిక కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తాము గెలవడం కన్నా… బలం పెంచుకోవడంపైనే దృష్టి పెట్టింది. ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్న ఎంపీ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. రెడ్డి ఓటర్లతో పాటు కలిసొచ్చే సమీకరణలు ఉన్న 45 అసెంబ్లీ స్థానాల్లో కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఏపీ కోసం ప్రత్యేక వ్యూహ బృందాన్ని సిద్ధం చేసుకున్నారు. ఆ దిశగా కార్యాచరణ కొనసాగిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close