చైనాపై టెక్ సర్జికల్ స్ట్రైక్స్..! టిక్ టాక్ సహా 59 యాప్స్‌పై బ్యాన్..!

చైనాకు చెందిన 59 యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇందులో టిక్ టాక్ కూడా ఉంది. అలాగే… అలీ బాబా గ్రూప్‌నకు చెందిన యూసీ బ్రౌజర్‌ను కూడా నిషేధించింది. ఎక్కువ మంది ఉపయోగించే బిగో లైవ్, క్లబ్‌ ఫ్యాక్టరీ, ఎంఐ కమ్యూనిటీ, షేర్ ఇట్, వీగో వీడియో లాంటి యాప్స్ అందులో ఉన్నాయి. చైనా యాప్స్..భారతీయ యూజర్లకు సంబంధించిన సమాచారాన్ని రహస్యంగా సేకరిస్తున్నాయన్న అనుమానం టెక్ నిపుణుల్లో చాలా కాలంగా ఉంది. వాటికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభించడంతో.. దేశ ప్రజల సమాచారం.. చైనా చేతికి చేరుతోందన్న క్లారిటీ రావడంతో… యాప్స్‌ను నిషేధించినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా చైనా యాప్స్… అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చిన తర్వాతే.. ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.

59 యాప్స్‌లో అత్యంత వివాదాస్పదమైనది.. టిక్ టాక్. అత్యధిక మంది యూజర్లు ఉన్న ఈ యాప్ ద్వారా టిక్ టాక్‌కు పెద్ద ఎత్తున ఆదాయం కూడా వస్తోంది. దీనిలో అసభ్యత.. అశ్లీలం పెరిగిపోవడంతో.. గతంలో.. కొన్ని రాష్ట్రాల హైకోర్టులు నిషేధించాయి. తర్వాత ఏదో కారణం చెప్పుకుని అనుమతి తెచ్చుకున్నారు కానీ.. ఎప్పుడు చైనాతో.. ఘర్షణలు తలెత్తినా.. చాలా మందికి ఈ యాప్ టార్గెట్. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత టిక్ టాక్ అన్‌ఇన్‌స్టాల్ ఉద్యమం నడిచింది. లాక్ డౌన్ టైంలో… అత్యధిక మంది డౌన్ లోడ్ చేసుకుని టైమ్ పాస్ చేశారు. ఈ కారణంగా ఆ ఉద్యమం పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఇప్పుడు కేంద్రం బ్యాన్ చేసింది.

నిషేధించిన 59 యాప్స్.. భారత అంతర్గత రక్షణ, పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగిస్తున్నాయని కేంద్రం ప్రకటించింది. కేంద్రం నిషేధంతో .. ఆ యాప్స్ పని చేయడం నిలిచిపోతాయి. ఈ యాప్స్ నిలిపివేయడం వల్ల.. చైనీస్ కంపెనీలకు భారీ నష్టం వాటిల్లుతుంది. బాయ్ కాట్ చైనా ఉద్యమంలో… ఆ దేశాన్ని .. ఆ దేశ ఉత్పత్తులను ప్రజలకు దూరం చేయడంలో.. కేంద్రం ఓ అడుగు ముందుకు వేసిందని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close