పురంధరీశ్వరి పరిస్థితి ఏంటి? కొనసాగుతారా ?

ఎట్టకేలకు బిజెపి అధ్యక్ష పదవి మీద సస్పెన్స్ వీడిపోయింది. కన్నా లక్ష్మీనారాయణను ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ప్రకటించేసింది బిజెపి హైకమాండ్. నిజానికి ఏడాది కిందటే ఈ నియామకం జరగాల్సి ఉన్నా ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేస్తూ వచ్చింది బిజెపి. హరిబాబు వైదొలుగుతాడని తెలియగానే చాలా పేర్లే బయటికి వచ్చాయి. పురందేశ్వరి పేరు కూడా అందులో ఉంది. ఒక వర్గం, పురంధరేశ్వరికి ఈ పదవి ఇవ్వాలని కోరింది. అయితే అప్పుడు ఆవిడకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేదని ఫిరాయింపు దారని కారణాలు చెప్పారు ఇప్పుడు అదే కన్నా లక్ష్మినారాయణకు పదవి ఇచ్చారు.

నిజానికి పురందరేశ్వరి ఈ పదవి చేపట్టి ఉంటే బిజెపికి కొన్నిరకాల లాభాలు ఉన్నాయి. అందులో మొదటిది చంద్రబాబును ఎండగట్టడంలో ఆవిడ ఏనాడు వెనక్కి తగ్గలేదు. రెండవది, ఎవరు అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక వర్గం బలంగా ఉంది. ఒక వర్గం మీడియా అండ కూడా ఆ వర్గానికి ఉంది. బిజెపి పార్టీ పరిస్థితి రాష్ట్రంలో ఇంతగా దిగజారడానికి ఒక కారణం ప్రత్యేక హోదా ఇవ్వక పోవడం అయితే, రెండవ కారణం మీడియాను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం. పురందరేశ్వరి కనుక అధ్యక్ష పదవి చేపట్టి ఉంటే ఎంతో కొంత సానుకూల దృక్పథం మీడియాకి కూడా కలిగి ఉండేది. అయితే మరికొంతమంది ఈ విషయమై వ్యంగ్యంగా మాట్లాడుతూ – కన్నా లక్ష్మీనారాయణకు పదవి ఇచ్చారు కాబట్టి సరిపోయింది కానీ పురంధరేశ్వరికి ఇచ్చి ఉంటే, ఒక వర్గం మీడియాలో ఆమె అంచలంచలుగా బిజెపిలో ఎదిగిన వైనం గురించి పెద్ద పెద్ద కథనాలు వేసి ఉండేవారు, ఆవిడ బాల్యము విద్యాభ్యాసము నుంచి మొదలు పెట్టేవారు అంటూ వ్యంగ్య వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ వ్యంగ్యం లో కాస్త నిజం ఉన్నప్పటికీ, మరొక రకంగా చూస్తే ఇవాళ బీజేపీని ఏకి పారేస్తున్న మీడియా పురంధరేశ్వరి కారణంగా ఆ పార్టీ నిర్ణయాలను కాస్త సానుకూలంగా అవలోకనం చేసేది అని అర్థమవుతుంది. ఇది ఆ పార్టీకి లాభించే అంశం.

అయితే ఎప్పుడైతే అమిత్ షా ఈ పదవి కాపులకే అని ప్రకటించాడో, అప్పుడే ఈ పదవి పురంధరేశ్వరి కి వచ్చే అవకాశమే లేదని అర్థమైంది . గత కొద్దికాలంగా పురందరేశ్వరి కి కూడా వైఎస్సార్సీపీ నుంచి రాయబారాలు నడుస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆవిడ ఏది నిర్ణయించుకున్నట్టుగా లేదు. తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ ఆవిడ వెళ్లే అవకాశాలు లేవు. అయితే కన్నా ఉదంతం తర్వాత, బిజెపి నుంచి జగన్ పార్టీకి వెళ్ళాలనుకునేవారు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఎందుకంటే బిజెపి మేరకే జగన్ కన్నా లక్ష్మీనారాయణ విషయంలో వెనక్కి తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ జగన్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా పురందరేశ్వరి కు కూడా ఇదే సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన నచ్చినా నచ్చకపోయినా పురందరేశ్వరి బీజేపీలోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com