ఐసిస్ ఉగ్రాదులపై పోరు అగ్రరాజ్యాల మధ్య పోరుగా మారబోతోందా?

సిరియాలోని ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలపై రష్యా, అమెరికా సంకీర్ణ వాయుసేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. సిరియాలోని సింజార్ అనే పట్టణాన్ని కొంత కాలం క్రితం ఐసిస్ ఉగ్రవాదులు చేజిక్కించుకొన్నారు. దానిని మళ్ళీ వారి చేతిలో నుండి విడిపించేందుకు ఇంతకు ముందు అక్కడ నివసించిన కుర్దులు, యాజిదీ తెగలకు చెందిన సుమారు 7, 500 మందికి గగనతలం నుండి అమెరికా సంకీర్ణ వాయుసేనలు రక్షణ కల్పిస్తుంటే ఈరోజు (బుదవారం) వారు సింజార్ పట్టణాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకొనే ప్రయాత్నాలు చేసారు. ఆ సందర్భంగా ఆ పట్టణంలో ఉన్న ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలపై అమెరికా సంకీర్ణ వాయుసేనలు బాంబుల వర్షం కురిపించాయి.

అదే సమయంలో రష్యాకి చెందిన వాయుసేనలు సిరియాలో రక్కా అనే పట్టణంలో ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. రక్కా పట్టణాన్ని ఆక్రమించుకొన్న ఐసిస్ ఉగ్రవాదులు దానిని తమ రాజధానిగా ప్రకటించుకొని అక్కడ సుమారు 5,000 మందికి పైగా ఉగ్రవాదులను కాపలాపెట్టుకొన్నారు. రష్యా యుద్ద విమానాలు బుదవారం వారి కమాండ్ సెంటర్ ని పేల్చి వేశాయి. గత 24 గంటలలో 20 సార్లు దాడులు చేసి ఐసిస్ ఉగ్రవాదులకు చెందిన 9 ముఖ్య స్థావరాలను ద్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి కొనషిన్ కొవ్ తెలిపారు. ఉగ్రవాదంపై తన యుద్ధం ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదీమీర్ పుతీన్ సిరియా నుండి ఐసిస్ ఉగ్రవాదులను పూర్తిగా తుడిచి పెట్టేసేందుకు ఏకంగా 1,50,000 మంది సైనికులని పంపించ బోతున్నట్లు ప్రకటించారు.

ఒకేసారి అగ్రరాజ్యాలన్నీ తమపై బాంబుల వర్షం కురిపిస్తుండటంతో ఐసిస్ ఉగ్రవాదులు తట్టుకోలేకపోతున్నారు. అందుకే తమకు బందీగా చిక్కిన ఒక రష్యా గూడఛారిని ఐసిస్ ఉగ్రవాదులు గొంతు కోసి హత్య చేసి దానిని వీడియో గా చిత్రీకరించి ఇంటర్నెట్ లో పెట్టారు. తమపై బాంబులతో దాడులు చేస్తున్న అమెరికా, రష్యా, వాటితో చేతులు కలుపుతున్న అన్ని దేశాలు బారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతీన్, అతని కుటుంబ సభ్యులని అందరినీ తమ కత్తులకు బలిచేస్తామని హెచ్చరించారు. త్వరలోనే రష్యాలో రక్తం సముద్రంలాగ పారుతుందని తమ వీడియోలో హెచ్చరించారు. రష్యా పశ్చిమాన్న గల కాంట్యేషెవ్ అనే ఒక గ్రామంపై బాంబు దాడులు చేయాలని ఐసిస్ ఉగ్రవాదుల ప్రయత్నాన్ని రష్యా ముందే పసిగట్టి అడ్డుకోగలిగింది.

రష్యా, అమెరికా సంకీర్ణ సేనలన్నీ ఐసిస్ ఉగ్రవాదులపైనే పోరాడుతున్నప్పటికీ మళ్ళీ సిరియా ప్రభుత్వం విషయంలో అమెరికా, రష్యాలు పరస్పరం కత్తులు దూసుకొంటున్నాయి. సిరియా అధ్యక్షుడు బసర్ అల్ అషాద్ ప్రభుత్వాన్ని అమెరికా వ్యతిరేకిస్తుంటే, రష్యా అషాద్ ప్రభుత్వానికి అండగా నిలబడుతోంది. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా రష్యా వైఖరిని ఖండిస్తూ, “ఆఫ్ఘనిస్తాన్ లో చేదు అనుభవాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. సిరియా అంతర్గత యుద్దంలో రష్యా వేలు పెట్టాలని ప్రయత్నిస్తే మళ్ళీ అటువంటి చేదు అనుభవాలే ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సంగతి పుతీన్ కి కూడా తెలుసని నాకు తెలుసు. కనుక రష్యా తన పోరాటాన్ని ఐసిస్ ఉగ్రవాదులవరకే పరిమితం చేసుకోవడం మంచిది,” అని సున్నితంగా హెచ్చరించారు. కానీ రష్యా వెనకడుగు వేసే ఉద్దేశ్యంలో లేదు. సిరియాలో రష్యా వాయుసేన మొహరించి యుద్దానికి సిద్దంగా ఉంది.

ఐసిస్ ఉగ్రవాదుల అధీనంలో ఉన్న సిరియాలోని చమురు బావుల నుండి టర్కీ చమురు కొనుగోలు చేస్తూ ఉగ్రవాదులకు ఆర్ధికంగా సహాయపడుతోందని పుతీన్ ఆరోపించడం గమనిస్తే, అమెరికా, రష్యాల యుద్ధం సిరియాలోని చమురు బావులపై ఆధిపత్యం కోసమే జరుగుతున్నట్లు అనుమానం కలుగుతోంది. ఇరాక్ లో కూడా ఇంచుమించు ఇటువంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. అగ్రరాజ్యాల చమురు దాహానికి, ఐసిస్ ఉగ్రవాదుల కిరాతకాలకి ఇరాక్, సిరియా ప్రజలు, ముఖ్యంగా మహిళలు, అభం శుభం తెలియని పసిపిల్లలు, అన్యాయంగా బలయిపోతున్నారు పాపం! ఈ కష్టాలు భరించలేక సముద్ర మార్గం గుండా వారు అక్రమంగా టర్కీ తదితర దేశాలకు పారిపోయే ప్రయత్నంలో చిన్నచిన్న బోట్లలో ప్రయాణిస్తూ, నిత్యం అనేక మంది ప్రజలు, చిన్నారులు సముద్రంలో పడి చనిపోతున్నారు. నిత్యం డజన్ల కొద్దీ వారి శవాలు ఒడ్డుకు కొట్టుకు వస్తుంటే అది ఎంత హృదయ విదారకంగా ఉంటుందో మాటలలో చెప్పలేము. అగ్రరాజ్యాల ఈ చమురు దాహం, ఐసిస్ ఉగ్రవాదుల రక్త దాహం తీరడానికి ఇంకా ఎన్ని వేలమంది ప్రజలు బలవుతారో ఎవరికీ తెలియదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close