జీవిత సారీ చెబితే స‌రిపోతుందా?

రాజ‌శేఖ‌ర్ వ్య‌వ‌హారంతో.. టాలీవుడ్ పెద్ద‌లంతా సీరియ‌స్‌గా ఉన్నారు. రాజ‌శేఖ‌ర్‌పై త‌క్ష‌ణం చ‌ర్య తీసుకోవాల‌ని చిరంజీవి సైతం సూచించ‌డంతో ఆయ‌న‌పై యాక్ష‌న్ త‌ప్ప‌ద‌నిపిస్తోంది. ‘మా’ డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో భాగంగా రాజ‌శేఖ‌ర్ దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. స‌భా మ‌ర్యాద కూడా పాటించ‌ని రాజ‌శేఖ‌ర్‌పై ‘మా’ స‌భ్యుల‌తో పాటు, చిత్ర‌సీమ పెద్ద‌లు ఫైర్ అవుతున్నారు. రాజ‌శేఖ‌ర్ మాట్లాడి వెళ్లిపోయిన త‌ర‌వాత‌… జీవిత వేదిక‌పైకి వ‌చ్చి మైకు అందుకుని రాజ‌శేఖ‌ర్ ది చిన్నపిల్లాడి మ‌న‌స్త‌త్వం అని, ఆయ‌న్ని క్ష‌మించ‌మ‌ని కోరారు. త‌మ కుటుంబానికి ఎవ‌రితోనూ ఎలాంటి విబేధాలు లేవ‌ని, న‌రేష్‌తో సైతం క‌ల‌సి ప‌నిచేయ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని వెల్ల‌డించారు. ఈమాత్రం దానికి రాజ‌శేఖ‌ర్ వేదిక‌పై అంత సీరియ‌స్ అవ్వ‌డం ఎందుకు? ఏమైనా ఉంటే… కూర్చుని మాట్లాడుకోవాలి క‌దా అన్న‌ది సినీ పెద్ద‌ల వాద‌న‌. జీవిత వ‌చ్చి క్ష‌మాప‌ణ‌లు చెప్పినంత మాత్రాన ఈ వివాదం చ‌ల్లారిపోయిన‌ట్టు కాదు. రాజ‌శేఖ‌ర్ పై చ‌ర్య తీసుకోవ‌డం దాదాపుగా ఖాయ‌మైపోయింది. అయితే అది ఏ రేంజులో ఉంటుంద‌న్న‌ది మాత్రం తేలాలి.

రాజ‌శేఖ‌ర్ మ‌ద్యం సేవించి వ‌చ్చారా?

అయితే రాజ‌శేఖ‌ర్‌పై మ‌రో ఆరోప‌ణ కూడా గ‌ట్టిగా వినిపిస్తోంది. ఈ కార్య‌క్ర‌మానికి రాజ‌శేఖ‌ర్ మ‌ద్యం సేవించి వ‌చ్చార‌ని, ఆ మ‌త్తులో ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడార‌ని కొంత‌మంది `మా` స‌భ్యులు ఆరోపిస్తున్నారు. కొద్దిసేప‌టి క్రితం పార్క్ హ‌య‌త్‌లో `మా` కీల‌క స‌మావేశం జ‌రిగింది. ప్ర‌ధాన ఎజెండా రాజ‌శేఖ‌ర్‌పై తీసుకోవాల్సిన యాక్ష‌న్ గురించే అని తెలుస్తోంది. మ‌ద్యం సేవించి రావ‌డం నిజ‌మ‌ని `మా` భావిస్తే గ‌నుక ఆయ‌న‌పై ఇంకాస్త కఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close