చైతన్య : రాజకీయ రచ్చతో “ఇంటర్” నిందితులు తప్పించుకున్నట్లే..!

తెలంగాణలో ఐదేళ్ల కాలంలో ఎన్నో సంచలనాత్మక విషయాలు వెలుగు చూశాయి. డ్రగ్స్ కేసు, నయీం కేసుల్లాంటివి ఎన్నో… తెరమీదకు వచ్చినంత వేగంగానే వెనక్కుపోయాయి. ఎంత హడావుడి చేశారంటే.. ఇక తేల్చేయడమే తరువాయని చెప్పి కోల్డ్ స్టోరేజీలో పడేశారు. విద్యారంగంలో.. ఎంసెట్ లీకేజీ కూడా అలాంటిదే. ఆ లీకేజీని ఎవరు చేశారో.. ఎవరు నిందితులో.. అన్నీ తెలిసి… తొక్కి పడేశారు. ఇప్పుడు ఇంటర్ ఫలితాల వ్యవహారం. అసలు దొంగలెవరో కళ్ల ముందు కనిపిస్తున్నా… ఎప్పటికీ తేలని వ్యవహారం అని.. తాజా పరిణామాలతో నిరూపితమయిపోతోంది.

తప్పెవరిదో తెలిసినా తెలియనట్లు ఎందుకుంటున్నారు..?

తెలంగాణలో ఈ ఏడాది ఇంటర్ పరీక్షల ఫలితాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఫెయిలనవాళ్లు పాసయినట్లుగా..పాసయిన వాళ్లు ఫెయిలయినట్లుగా.. తప్పుల తడకగా మార్కుల జాబితాలు వచ్చాయి. ఒకరిద్దరి ఆందోళనతో బయటకు వచ్చిన ఈ వ్యవహారం… చివరికి.. పరీక్ష రాసిన ప్రతి ఒక్కరూ అనుమానపడేలా…రచ్చరచ్చ అయింది. మొదట్లో అంతా అపోహలే అన్న ప్రభుత్వం, ఇంటర్ బోర్డు చివరికి తప్పులు జరిగాయని అంగీకరించక తప్పలేదు. అయితే..దిద్దుబాటు చర్యల్లో పారదర్శకత లోపించింది. హడావుడిగా వేసిన త్రిసభ్య కమిటీ … నివేదికను …ప్రభుత్వం బయట పెట్టలేదు. అందులోని కొన్ని అంశాలను.. విద్యాశాఖ కార్యదర్శి వెల్లడించారు. కానీ నిర్దిష్టంగా.. తప్పు ఎక్కడ జరిగింది..? అన్యాయం జరిగిన విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేయాలి..? భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా ఏంచేయాలన్నదానిపై… త్రిసభ్య కమిటీ ఇచ్చిన సిఫార్సుల పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. తప్పు ఎవరు చేశారు..? ఎవరికి శిక్ష వేయాలన‌్న దానిపై.. ప్రభుత్వం మాట్లాడటం లేదు.

గ్లోబరీనా గుట్టు ఎందుకు బయటపెట్టరు..?

అసలు ఇంటర్ ఫలితాల్లో గందరగోళం వచ్చినప్పటి నుంచి అందరి నోళ్లనూ నానుతున్న సాఫ్ట్ వేర్ సంస్థ గ్లోబరీనా. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి గ్లోబరీనా ఇంటర్ బోర్డుకు చుక్కలు చూపిస్తోందనేది బహిరంగరహస్యం. అడ్మిషన్ల వ్యవహారంలో..చేతులెత్తేయడంతో… మళ్లీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో… ఇంటర్ బోర్డు చేయించుకుంది. అయితే.. ఈ గ్లోబరీనా సంస్థ తప్పిదాలు మాత్రం.. బయటకు రావడం లేదు. త్రిసభ్యకమిటీ నివేదికలో.. గ్లోబరీనా గురించి ఏం సిఫార్సులు చేశారో బయటకు రాలేదు. అదే సమయంలో.. అసలు.. ఇంటర్ బోర్డుకు… గ్లోబరీనాకు మధ్య న్యాయబద్ధమైన ఒప్పందం ఏదీ లేదన్న ప్రచారం జరుగుతోంది. అలాంటి ఒప్పందం ఏమీ లేకుండా కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారన్నదానిపై అనేక చర్చలు జరుగుతున్నాయి. ఓ వైపు విద్యార్థుల ఆందోళన.. మరో వైపు.. గ్లోబరీనా వ్యవహారం.. విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సంస్థను కాపాడటానికే… ప్రభుత్వం పని చేస్తోందన్న అనుమానం అందరిలోనూ ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి.

అన్యాయమైపోయిన విద్యార్థులకు ఎలా చేస్తారు..?

రాజకీయపార్టీలు ఒక్కసారిగా ఇంటర్ బోర్డు వ్యవహారాన్ని రాజకీయం చేశాయి. ఇటీవలి కాలంలో ఓ సమస్య విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై విపక్షాలన్నీ పోరాటం చేయడం ఇదే ప్రథమం. దాంతో ఈ అంశంగా పెనుసంచలనం అయింది. గ్లోబరీనా సంస్థ యాజమాన్యానికి టీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపణలు చేస్తూ.. రాజకీయ పార్టీలన్నీ ఆ సంస్థనే గురి పెట్టాయి. ఓ రకంగా ఇప్పుడు ఇంటర్ ఫలితాల వ్యవహారం రాజకీయం అయిపోయింది. విద్యార్థులకు న్యాయం చేసేలక్ష్యంతో.. పోరాటం ప్రారంభించిన రాజకీయపార్టీలు ఆ లక్ష్యానికి దూరంగా..సొంత పొలిటికల్ మైలేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఓ వైపు… విద్యార్థుల ఆత్మహత్యలు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. జాతీయ మానవ హక్కుల సంస్థ కూడా నోటీసులు జారీ చేసింది. విద్యార్థులు అసంతృప్తితో ఉన్నారు. కానీ ఇప్పటికే విషయం పక్కదారి పట్టిపోయింది. అన్యాయమైపోయిన విద్యార్థులు రోదిస్తూనే ఉన్నారు. రాజకీయం మాత్రం… అసలు విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close