ఇంతకీ ఆ “బీసీ ద్రోహి పిటిషనర్లు” టీడీపీనా..? వైసీపీనా..?

స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు అంశంపై.. హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది.. మీ పార్టీ వారంటే..మీ పార్టీ వారని.. టీడీపీ, వైసీపీ పరస్పర విమర్శలు చేసుకోవడం ప్రారంభించాయి. విమర్శలు మాత్రమే కాదు.. బీసీ ద్రోహి మీరంటే.. మీరేనని.. ఘాటుగా తిట్లు కూడా అందుకుంటున్నారు. 59.85 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం… కుదురదని.. 50 శాతం లోపే రిజర్వేషన్లు ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే.. రెండు రాజకీయ పార్టీలు రంగలోకి దిగిపోయాయి. ముందుగా సోషల్ మీడియా టీంలు.. ప్రచారం ప్రారంభించాయి. ఈ పిటిషన్లను.. బోయ రామాంజనేయులు, ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తులు వేశారు. ఈ ఇద్దరూ టీడీపీ నేతలంటూ… వైసీపీ నేతలు.. వారి సోషల్ మీడియా విభాగం ప్రచారం ప్రారంభించింది. ఆ వెంటనే బొత్స సత్యనారాయణ కూడా ప్రెస్‌మీట్ పెట్టి.. అదే ఆరోపణలు చేశారు.

వీరి దూకుడు ఇలా సాగుతూండగానే టీడీపీ కూడా రంగంలోకి వచ్చింది. బోయ రామాంజనేయులు, ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తులు వైసీపీ పార్టీ వారేనని ఫోటోలు విడుదల చేసింది. బోయరామాంజనేయులు తన ఊళ్లో పెట్టున్న ఫ్లెక్సీని.. ప్రతాప్ రెడ్డి… జగన్ తో దిగిన ఫోటోను.. టీడీపీ విడుదల చేసిది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని ప్రచారం చేసి.. తమ పార్టీ వారితోనే కోర్టుకెళ్లేలా చేసి.. బడుగుల్ని ఘోరంగా మోసం చేశారని టీడీపీ ఆరోపణలు ప్రారంభించింది. టీడీపీ సోషల్ మీడియా విభాగం కూడా..ఆ పిటిషనర్లు ఇద్దరి ఫోటోలను విపరీతంగా సర్క్యూలేట్ చేయడం ప్రారంభించింది. రిజర్వేషన్ల తగ్గింపు వల్ల బీసీల్లో ఆగ్రహం వస్తుందని.. ఆ ఆగ్రహం తమ వైపు రాకుండా ఉండేందుకు రెండు పార్టీలు.. శక్తి వంచన లేకుండా.. ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నాయి.

బోయ రామాంజనేయులు, ప్రతాప్ రెడ్డి.. ఇద్దరూ ఏదో ఓ రాజకీయ పార్టీకి చెందిన వారే. కానీ ఇప్పటికై.. వారిద్దరూ.. ఏ పార్టీకి చెందిన వారు కాదు. అన్ వాంటెడ్. కొన్ని రోజులు పోయాక.. వారు ఏ పార్టీ తరపున కోర్టుకెళ్లారో… ఆ పార్టీలోనే గుర్తింపు లభించవచ్చు. అప్పటి వరకూ గప్ చుప్..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి దొరికిన పీవోకే అస్త్రం !

బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటోందని ప్రచారం జరుగుతున్న సమయంలో రిజర్వేషన్ల రద్దు పై ప్రజల్లో జరిగిన చర్చ ఆ పార్టీని సమస్యల్లోకి నెట్టింది. చచ్చినా రిజర్వేషన్లు రద్దు చేయబోమని ప్రజల్ని బతిమాలుకోవాల్సి వచ్చింది....

రేవంత్ రాజీనామా…? త్వరలో కొత్త బాస్?

లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త పీసీసీ అద్యక్షుడి నియామకం ఉంటుందని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించడంతో పార్టీ ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. జూన్ నెలాఖరులో లోకల్ బాడీ...

ఈసీపై నిందలేయడానికే ప్లాన్డ్ హింస !

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతర హింస దేశం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కువగా హింస జరుగుతుంది. అది రెండు, మూడు రోజుల్లో సద్దుమణిగిపోతుంది. కానీ ...

క్యాడర్ హోప్స్ పెట్టుకోవద్దని హింట్స్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ క్యాడర్ ను ఆర్తికంగా చితికిపోకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. బెట్టింగులు కట్టి నష్టపోకుండా ఉండేందుకు ఆయన మెల్లగా హింట్స్ ఇస్తున్నారు. దాదాపుగా ప్రతి రోజూ ప్రెస్ మీట్లు పెట్టి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close