ఇస్మార్ట్ శంక‌ర్‌ స్క్రిప్టు లీకేజీ – పోలీసుల్ని ఆశ్ర‌యించిన పూరి

పూరి కొత్త సినిమాకీ లీకేజీల గోల త‌ప్ప‌లేదు. సినిమా విడుదల‌కు ముందే కొన్ని సీన్లు లీక్ చేయ‌డం ఓ ప‌ద్ధ‌తి. ఇప్పుడు ఏకంగా.. స్క్రిప్టు మొత్తాన్ని బ‌య‌ట పెట్టేశారు. ఓ యువ‌కుడు `ఇస్మార్ట్ శంక‌ర్‌` స్క్రిప్టుని ఇన్‌స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసేశాడు. దాంట్లో సీన్ నెం 1 నుంచి శుభం కార్డు వ‌ర‌కూ డైలాగ్ వెర్ష‌న్‌తో స‌హా అన్నీ ఉన్నాయి. వెంట‌నే పూరి, ఛార్మిలు పోలీసుల్ని ఆశ్ర‌యించారు. ముర‌ళీ కృష్ణ అనే యువ‌కుడు ఈ స్క్రిప్టు మొత్తాన్ని లీక్ చేశాడ‌ని పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. పోస్ట్ తీసేయ‌డానికి ముర‌ళీ కృష్ణ భారీగా డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నాడ‌ని ఛార్మి పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు ముర‌ళీ కృష్ణ‌పై కేసు ఫైల్ చేశారు.

క‌థ చెప్పిన‌ప్పుడే కొంత‌మంది కీల‌క న‌టీన‌టులకు, సాంకేతిక నిపుణుల‌కు స్క్రిప్టు కాపీ ఇవ్వ‌డం పూరికి అల‌వాటు. అలాంటి ఓ స్క్రిప్టు కాపీ చేతులు మారుతూ… ముర‌ళీకృష్ణ కు చేరింది. దాంతో ముర‌ళీకృష్ణ దాన్ని అప్‌లోడ్ చేసేశాడు. చిత్ర‌బృందం ముందుగా స్పందించ‌డంతో.. ఆ స్క్కిప్టు వైర‌ల్ కాక‌మునుపే ఆప‌గ‌లిగేవారు. లేదంటే… క‌థ మొత్తం తెలిసిపోయి, ఆ కిక్ పోయేది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close