చైతన్య : హైదరాబాద్‌ నుంచి ఐటీ కంపెనీలు పరారవ్వడానికి ఇది చాలు..!

హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలను రాజకీయ పరంగా చూసుకుని టార్గెట్ చేసిన వ్యవహారం.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు మాయని మచ్చలా పడనుంది. ఇక నుంచి కొత్తగా ఎవరైనా హైదరాబాద్ లో ఐటీ కంపెనీ పెట్టాలనుకున్నా.. ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితి. కొత్తగా హైదరాబాద్ రావాలన్నా.. ముందుగా వేరే ఆప్షన్లు చూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిపోయింది.

కేసు నమోదు చేసి సాక్ష్యాల కోసం డేటా అడుగుతారా..?

ఐటీ గ్రిడ్ అనే సంస్థ వద్ద.. ఆంధ్రప్రభుత్వ ప్రజలకు సంబంధించిన రహస్య సమాచారం ఉందని.. ఈ సంస్థ…విశాఖలోని బ్లూ ఫ్రాగ్ అనే సంస్థ వద్ద చోరీ చేసిందనేది.. వైసీపీ నేత లోకేశ్వర్ రెడ్డి అర్థరాత్రి పోలీసులకు చేసిన ఫిర్యాదు. దానికి తగ్గట్లుగా ఎలాంటి సాక్ష్యాలు ఇవ్వలేదు. ఆయన కనీసం ఏపీ పౌరుడు కాదు. తెలంగాణ ఓటర్, ఆధార్ కూడా తెలంగాణలోనే ఉంది. కేవలం.. ఫిర్యాదు మాత్రమే ఇచ్చారు. ఫిర్యాదు ప్రకారమే సోదాలు చేశారు. హార్డ్ డిస్కులు, సీపీయూలు తీసుకెళ్లారు. ఇక అందులో వారు చెప్పిన ఏపీ ప్రజల రహస్య సమాచారం ఉందా అంటే…లేదనే చెబుతున్నారు పోలీసులు. డిలీట్ చేశారు.. ఎఫ్ఎస్ఎల్‌లో వాటిని మళ్లీ బయటకు తీస్తామని చెబుతున్నారు. ఆ సంస్థ యజమాని అశోక్‌ను పట్టుకుని ఆయనకు మాత్రమే యాక్సెస్ ఉండే..ఆ కంపెనీకి చెందిన క్లౌడ్ ఓపెన్ చేస్తే..సమాచారం తెలుస్తుందని.. ఆయన కోసం..ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఇది ఐటీ కంపెనీలను ఇంకా ఆందోళనకు గురి చేస్తోంది.

రేపు పోటీ కంపెనీలు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇలాగే చేస్తే ఎలా..?

మొదటగా అనుమానంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సాక్ష్యాల కోసం కంపెనీ డేటాను బయటకు తీయాలంటున్నారు. డేటా ఓపెన్ చేస్తే అందులో కంపెనీకి సంబంధించిన క్లైంట్ల సమాచారం మొత్తం ఉంటుంది. దాన్ని పోలీసులు యాక్సెస్ చేస్తే.. క్లైంట్ల ఒప్పందాలకు తూట్లు పడినట్లే. ఇప్పుడు కేసు ద్వారా ఎలాగైనా అశోక్ ద్వారా అమెజాన్ క్లౌడ్ లో ఉన్న సమాచారాన్ని యాక్సెస్ చేసి.. తమ కేసుకు సాక్ష్యాలు సేకరించాలని… పోలీసులు అనుకుంటున్నారు. సాక్ష్యాలు లేకపోయినా వారికి పోయేదేమీ లేదు. కానీ.. తన క్లైంట్ల సమాచారం పోలీసులకు అందితే.. ఐటీ గ్రిడ్ కంపెనీకి ఇక భవిష్యత్ ఉండదు. అందుకే.. డేటా సేఫ్ అని.. హైదరాబాద్ కు వస్తే రాజకీయ కారణాలతో.. కంపెనీలను టార్గెట్ చేయడం.. వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు రాజకీయ పార్టీలు.. రేపు పోటీ కంపెనీలు.. తెలంగాణ సర్కార్ తో సన్నిహితంగా వ్యవహరించి ఇలాంటి దాడులు చేస్తే.. కుప్పకూలిపోతామనే భావనలోకి ఐటీ కంపెనీలు వెళ్లిపోతున్నాయన్న భావన ఐటీ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ ఆటలో ఐటీ కంపెనీలు బలి..! బ్రాండ్ ఇమేజ్‌కు దెబ్బే..!

అసలు ఈ మొత్తం ఎపిసోడ్‌ టార్గెట్.. టీడీపీ దశాబ్దాలుగా నిర్వహించుకుంటూ వస్తున్న సమాచారాన్ని చోరీ చేసి.. వైసీపీకి ఇవ్వడమేనని టీడీపీ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. పోలీసులు దొంగల్లా మారి ఆ పని పూర్తి చేశారని… టీడీపీ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే.. వైసీపీ నిర్వహిస్తున్న కాల్ సెంటర్ నుంచి.. టీడీపీ బూత్ కన్వీనర్లకు..ఫోన్లు వస్తున్నాయి. ప్రలోభ పెట్టడం ద్వారానో.. భయ పెట్టడం ద్వారానో వారిని తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో వాళ్ల డాటా అంతా తమ దగ్గర ఉందని.. కాల్ సెంటర్ ఉద్యోగిని బెదిరించడం… కొసమెరుపు. ఈ మొత్తం వ్యవహారంలో డేటాచోరీనే కీలకం. ఓ ఐటీ కంపెనీపై డేటా చోరీ చేసిందనే నింద వేశారు. సోదాలు చేశారు. అదే ఐటీ కంపెనీలో.. ఉన్న డేటాను పోలీసుల ద్వారా .. తమ డేటాను చోరీ చేశారని టీడీపీ అంటోంది. ఏదైనా మొత్తానికి ఐటీ కంపెనీకే తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ రెండింటిలో ఏదో ఒక్కటే నిజం అయి ఉంటుంది. ఏది నిజం అయినా.. కంపెనీకి మాత్రం నష్టం. ఇదే ఐటీ కంపెనీలను ఆందోళనకు గురి చేస్తోంది. హైదరాబాద్ ఇక డేటా సేఫ్ నగరం కాదనే వాదన వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close