ఆస్తులెలా పెరిగాయి..? ఆదాయం ఏమిటి..?.. కేసీఆర్‌కు ఐటీ నోటీసులు..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు… ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల సమయంలో నామినేషన్ సమయంలో డిక్లేర్ చేసిన ఆస్తులకు… 2018 అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల సమయంలో డిక్లేర్ చేసిన ఆస్తులకు మధ్య చాలా తేడా ఉందని.. ఐటీ శాఖ భావిస్తోంది. అయితే.. ఆ మేరకు ఆదాయాన్ని..ఐటీ రిటర్న్స్‌లో చూపించలేదని గుర్తించారు. ఈ నాలుగేళ్ల ఐటీ రిటర్న్స్… ఆస్తులను.. పరిశీలించిన తర్వాత కేసీఆర్‌కు.. నోటీసులు జారీ చేసినట్లు.. రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ఆస్తి 2014లో రూ. 15.16 కోట్లుండగా… 2018 ఎన్నికల అఫిడవిట్ నాటికి అది రూ. 23.55 కోట్లకు చేరింది. వ్యవసాయదారునిగా.. కేసీఆర్ ఉన్నారు. ఫామ్‌హౌస్‌లో పంటలు పండిస్తూ ఉంటారు.

ఐటీ నోటీసులు ఒక్క కేసీఆర్‌కు మాత్రమే కాదని.. టీఆర్ఎస్ తరపున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలకూ ఈ నోటీసులు అందినట్లు ప్రచారం జరుగుతోంది. భారీగా ఆస్తులు పెరిగిన ఎమ్మెల్యేలు ఈ నోటీసులు అందుకున్నారని అంటున్నారు. కేటీఆర్ ఆస్తి నాలుగేళ్ల కాలంలో రూ. 7.98 కోట్ల నుంచి రూ. 41.83 కోట్లకు పెరిగింది. అలాగే ఓ పాతిక మంది ఎమ్మెల్యేలు.. కూడా.. ఈ నాలుగేళ్లలో వారు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ ను మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. వారికి కూడా నోటీసులు పంపినట్లు.. టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పెట్టారు. లెక్కల్లో తేడాలుంటే, అందుకుగల కారణాలను ఆధారాలతో సహా వివరించాలని ఈ నోటీసుల్లో ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. కేసీఆర్ మూడు నెలల ముందుగానే… అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడంతో… ఆ ఎన్నికల్లో అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నోటీసులు జారీ చేసినట్లు భావిస్తున్నారు. అయితే.. ఫార్మల్‌గానే ఈ నోటీసులు వస్తూ ఉంటాయని… వీటికి వివరణ పంపితే సరిపోతుందని.. కొంత మంది చెబుతున్నారు. అయితే… తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ… పోటీ చేసిన అభ్యర్థులెవరికీ.. ఇలాంటి ఐటీ నోటీసులు జారీ అయినట్లుగా సమాచారం లేదు. మరి టీఆర్ఎస్ నేతలకు మాత్రమే ఎందుకు నోటీసులు జారీ చేశారో మరి..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close