డేటాగ్రిడ్ కేసులో తన పేరు తీసేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన సీఈవో..!

తెలంగాణ పోలీసులు దాఖలు చేసిన డేటా చోరీ కేసులో తన పేరును తొలగించాలంటూ ఐటీ గ్రిడ్ సీఈవో అశోక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండో తేదీన లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఐటీ గ్రిడ్‌పై దాడి చేశారు. సోదాలు చేసి కంపెనీలో ఉన్న అన్ని సీపీయూ, ట్యాబ్, ల్యాప్‌ట్యాప్‌లు తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత అశోక్‌ను పరారీలో ఉన్నట్లుగా ప్రకటించారు. రెండో తేదీన కేసు నమోదు చేస్తే మూడో తేదీనే ఆయన పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత అశోక్‌కు నోటీసులు జారీ చేశామని పోలీసులు చెప్పారు. ఇప్పుడు హఠాత్తుగా ఆయన తనకు ఈ కేసుతో సంబంధమే లేదని తన పేరును పోలీసులు అనవసరంగా ఇరికించారంటూ కోర్టులో పిటిషన్ వేశారు. ఇది శనివారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ఐటి గ్రిడ్ సీఈవో వ్యూహాత్మకంగానే తన పేరు అనవసరంగా ఇరికించారని.. తీసేయాలని పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. ఆయనను నిందితునిగా పేర్కొనాలంటే ముందుగా ఆయన చేసిన నేరమేమిటో పోలీసులు కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. ఆయనపై కేసు ఎందుకు పెట్టారో పోలీసులు చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయంలో పోలీసులు ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారు. మొదట్లో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన గుప్తమైన సమాచారం చోరీ చేశారని పోలీసులు ప్రకటన చేశారు. తమ సమచారం ఏమీ పోలేదనీ ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ తర్వాత ఐటీ గ్రిడ్ సర్వే చేసి ఓట్లు తీసేస్తోందని మరో కేసులో చెప్పుకొచ్చారు. కానీ ఈ నేరాన్ని ధృవీకరించాల్సింది ఈసీ. ఈసీ మటుకు ఇతర వ్యక్తులు ఓట్లు తీసేసే అవకాశం లేదని చెబుతోంది. ఇప్పుడు పోలీసులు తాజాగా తెలంగాణ వ్యక్తుల వ్యక్తిగత సమాచారం ఉందని చెబుతున్నారు. అది స్వచ్చందంగా ఇచ్చిన సమాచారం అని ఐటీ గ్రిడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే తాము ఇంకా సర్వర్ల నుంచి చాలాడేటా రాబట్టాల్సి ఉందని అశోక్ అమెరికాలో ఉన్నా అమరావతిలో ఉన్నా పట్టుకుంటామని సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర చెప్పుకొచ్చారు.

ఈ తరణంలో అసలు కేసేమిటి అన్నది హైకోర్టులో విచారణకు రావాలన్న ఉద్దేశంతోనే తన పేరును కేసు నుంచి తీసేయాలని వ్యూహాత్మకంగా అశోక్ పిటిషన్ వేసినట్లు చెబుతున్నారు. మరో వైపు సిట్ కార్యాలయాన్ని డీజీపీ ఆఫీస్ నుంచి గోషామహల్‌కు తరలించారు. స్టీఫెన్ రవీంద్ర బృందం గోషామహల్ నుంచే విచారణ చేపట్టనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close