వైసీపీ నేతలకు జగన్ పీఏ బెదిరింపులు..! కేసుల దాకా వెళ్లాయా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవలి కాలంలో… రాజకీయ వ్యవహారాలు రచ్చకెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో… సమన్వయకర్తల నుంచి నిధుల వసూలు చేయడం, ఇవ్వని వారిని..మార్చేయడం వంటి పద్దతులు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదుల సంఖ్యలో నేతలు.. తమను జగన్ కోట్లకు కోట్లు అడిగారని.. అవి ఇవ్వకపోయే సరికి.. ఇతర నేతల్ని తీసుకొచ్చి… సమన్వయకర్తలుగా నియమించారని.. అంతర్గతంగా ఆవేదన చెందుతున్న వీడియోలు సోషల్ మీడియాలో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు… దీనికి సంబంధించి కొన్ని వివరాలు బయటకు వస్తున్నాయి.

సోమవారం హైదరాబాద్‌లో వైసీపీ ఐటీ సెల్ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పీఏ నాగేశ్వర్ రెడ్డి పేరును, ఫోన్ నెంబర్‌ను దుర్వినియోగం చేస్తూ ఆయన పేరుతో పార్టీ నేతలకు ఫోన్లు, మెస్సేజీలు పంపిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారనేది.. ఆ ఫిర్యాదు సారాంశం. ఆ ఫోన్ నెంబర్ లోటస్ పాండ్‌ ఆడ్రస్‌తో నమోదై ఉందని.. అందుకే హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశామని.. వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే.. ఫోన్ నెంబర్ ఒక్కటే ఉంటుంది.. ఆ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వెళ్లింది అంటే.. అది వాళ్లు చేసినట్లే లెక్క. లేకపోతే.. ఆ ఆఫోన్ ఇతరులకు అయినా ఇచ్చి ఉండాలి. అది తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. మరి పోలీసుల వరకూ వైసీపీ నేతలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..? అనేది చాలా మందికి అనుమానం వస్తున్న ప్రశ్న.

ఇటీవలి కాలంలో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా టిక్కెట్ కూడా డొలాయమానంలో పడిందని… ప్రచారం జరుగింది. అక్కడ కొత్త ఇన్చార్జ్ ను పెట్టబోతున్నారని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. ఈ ప్రచారంతో పాటే.. ఆయనకు ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసెజ్‌లు వెళ్లాయి. కొన్ని కోట్లు పార్టీ ఫండ్‌గా ఇవ్వాలని.. ఆ ఫోన్ కాల్స్, మెసెజుల సారాంశం. ఇలా ఒక్క దాడిశెట్టి రాజాకే.. కాదు.. ఓ ఇరవై, ముఫ్పై మందికి వెళ్లాయి. డబ్బులు ఉన్న వాళ్లు ఇచ్చారు. లేని వాళ్లు ఏం చేయాలా అని మథన పడుతున్నారు. ఈ వ్యవహారం ఫోన్ కాల్స్ రికార్డింగ్ సాక్షిగా బయటకు వచ్చే ప్రమాదం ఏర్పడటంతో.. ముందు జాగ్రత్తగా వైసీపీ నేతలు.. తమ మీదకు రాకుండా… జగన్ పీఏ మీదకో.. లేకపోతే… గుర్తు తెలియని వ్యక్తుల మీదకు తోసేసేందుకు ఈ ఫిర్యాదు చేసినట్లు… అనుమానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close