సమస్యలపై స్పందనేది..? సీఎం మౌనం ఏపీకి మంచిదేనా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవి చేపట్టి మూడున్నర నెలలు దాటిపోయింది. ఈ మూడున్నర నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ని అనేక సమస్యలు చుట్టుముట్టాయి. అవి నేరుగా ప్రభుత్వంతో పాటు… ప్రజలకు కూడా.. సంబంధించినవి. చాలా వరకు ప్రభుత్వం సృష్టించిన సమస్యలే. దీనిపై.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారంటే.. ఒక్క సారి కూడా.., ప్రజలకు క్లారిటీ ఇచ్చిన పాపాన పోలేదు. తాను ఎవరికీ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అనుకుంటున్నారేమో కానీ.. ప్రజలు మాత్రం మరోలా అనుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

అమరావతిపై మాట మాట్లాడకపోవడం బాధ్యతా రాహిత్యం కాదా..!?

రాజధాని.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినది. ఆయన వ్యక్తిగత వ్యవహారమో.. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఆస్తి వ్యవహారమో కాదు. దానిపై.. మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో రేగిన గందరగోళం ఇప్పటికీ సద్దుమణగలేదు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలూ.. నాయకులు.. ఒకటే డిమాండ్ వినిపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనిపై క్లారిటీ ఇవ్వాలన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. అమరావతి అనే పేరు ఎత్తడమే ఇష్టం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయన తరపున తన స్పందన ఇంత వరకూ బయటకు రాలేదు. మంత్రులు.. ఇతురులు.. అమరావతిని తరలిస్తామని సీఎం ఎప్పుడైనా చెప్పారా.. అంటూ ఎదురుదాడి చేస్తున్నారు. ఇక్కడే ఉంచుతామని కూడా సీఎం చెప్పలేదని ఇతరులు గుర్తు చేస్తున్నారు. కానీ సీఎం మాత్రం… ఎవరికీ ఏమి చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. తానే అమరావతిని నిలిపి వేయాలని సలహా ఇచ్చినట్లు నేరుగా తెలంగాణ సీఎం అసెంబ్లీలో ప్రకటించుకున్నారు. దీంతో ప్రజల్లో కొత్త అనుమానాలొస్తున్నాయి.

పోలవరంపై తెలంగాణ సీఎం మాట్లాడుతున్నారు.. ఏపీ సీఎం మాత్రం ప్లాస్టరేసుకున్నారు..!

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పై.. తెలంగాణ సీఎం తరచూ మాట్లాడుతున్నారు. అది ఆంధ్ర ప్రదేశ్ తరపునే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. పోలవరం ఎత్తు తగ్గింపునకు.. జగన్మోహన్ రెడ్డి.. అంగీకరించారని ఆయన స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. అంటే.. పోలవరంపై.. ఎంత గూడుపుఠాణి.. బ్యాక్ గ్రౌండ్‌లో జరుగుతుందో.. అన్న అనుమానాలు ప్రజల్లో ప్రారంభమయ్యాయి. అసలు పోలవరం ప్రాజెక్ట్ పనులను… అంత అర్థంతరంగా నిలిపి వేసి.. ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి నోరు తెరిచి.. పోలవరంపై జరుగుతున్న వ్యవహారం ఏందో.. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అయినా.. ఆయన మాత్రం.. పోలవరం తన వ్యక్తిగత వ్యవహారం అన్నట్లుగా ఉన్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వం సృష్టించిన ప్రజా సమస్యలపైనా స్పందించరా…?

కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆర్థికంగా కుంగిపోయారు సామాన్యులు. రోజుకూలీలు. ఇసుక కొత్త విధానం తెచ్చినప్పటికీ.. ఏదో కారణం చెప్పి.. అమ్మకాలు మాత్రం జరపడం లేదు. కానీ బ్లాక్ లో మాత్రం కావాల్సినంత దొరుకుతోంది. ఫలితంగా… భవననిర్మాణ రంగం.. కూలీలు.. కడపునిండా తినలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై… ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై కూడా.. ముఖ్యమంత్రి నుంచి వివరణ లేదు. ప్రభుత్వ పరంగా.. ఇసుక పై తీసుకున్న నిర్ణయం వల్ల.. ప్రభుత్వానికి భారీగా ఆదాయానికి గండి పడిందని కూడా స్పష్టమయింది. ఇదంతా.. ప్రజలకు సంబంధించినదే. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది.

ఏ నిర్ణయం అయినా గూడుపుఠాణిలా చేసుకుపోవడమేనా..?

మాజీ స్పకర్ స్థాయి వ్యక్తి ప్రభుత్వ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సచివాలయ ఉద్యోగుల పరీక్ష పేపర్లను.. రూ. లక్షలకు మంత్రుల స్థాయి వాళ్లే అమ్ముకున్నారని ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. బోటు ప్రమాదంలో ప్రభుత్వ పరంగా తీవ్ర నిర్లక్ష్యం బయటపడింది. నవరత్నాల విషయంలో.., ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు ఇప్పటికీ ఒక్కటీ అందలేదు. వాయిదాలేసుకుంటూ పోతున్నారు. లబ్దిదారుల ఎంపిక పేరుతో… వాలంటీర్లు గ్రామాల్లో అలజడి రేపుతున్నారు. ఇవి మాత్రమే కాదు.. మంత్రుల బాధ్యతా రాహిత్య ప్రకటనలతో అంతా గందరగోళం ఏర్పడింది. అయినా సీఎం మాత్రం.. దిలాసాగా ఉన్నారు. ప్రజలకు తాను జవాబుదారీ కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close