బిరియానీ అడిగితే మీల్స్ పెట్టాం: జ‌గ‌ప‌తిబాబు

`ప‌టేల్‌సార్‌` సినిమాపై జ‌గ‌ప‌తిబాబు చాలా ఆశ‌లు పెట్టుకొన్నాడు. ”ఈ సినిమా హిట్ అయితే నేను ఫీల్ అవుతా.. సూప‌ర్ హిట్ అవ్వాల్సిన సినిమా ఇది” అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. హిట్ కాదు క‌దా, క‌నీసం యావ‌రేజ్ కూడా అవ్వ‌లేదు ఈ సినిమా. అయితే.. జ‌గ‌ప‌తిబాబు ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు పెట్టుబ‌డి పెట్టాడ‌ని, అందుకే ఆ స్థాయిలోఇంట్రెస్ట్ చూపించాడ‌ని వార్త‌లొచ్చాయి. ప‌టేల్ సార్ ఫ్లాప్ త‌ర‌వాత‌… మ‌ళ్లీ మీడియా ముందుకు వ‌చ్చాడు జ‌గ్గూభాయ్. ”ఆ సినిమాపై ఆశ‌లు పెట్టుకొన్న మాట నిజ‌మే. కానీ… ఆ సినిమాలో నేనేం డ‌బ్బులు పెట్టలేదు. ప‌టేల్‌సార్ ఫ్లాప్ నిరుత్సాహ‌ప‌రిచింది. కానీ మంచి క‌థ అది. జ‌నాలు టైటిల్ చూసి హార‌ర్ , థ్రిల్ల‌ర్ అనుకొని ఏవేవో ఊహించుకొన్నారు. వాళ్లంతా బిరియానీ ఆశించి వ‌చ్చారు. మేం మీల్స్ పెట్టాం. పైగా విడుద‌ల తేదీ విష‌యంలో చాలా తొంద‌ర ప‌డ్డాం. హ‌డావుడిగా విడుద‌ల చేయ‌డం వ‌ల్ల‌.. అనుకొన్న ఫ‌లితం రాలేదు`”అని ‘ప‌టేల్ సార్ ‘పల్టీలు కొట్ట‌డానికి గ‌ల కార‌ణాలు విశ్లేషించాడు. ‘జ‌య జాన‌కి నాయ‌క‌’లో కీ రోల్ చేస్తున్నాడు జ‌గ్గూభాయ్‌. అఖిల్ సినిమాలోనూ… కీల‌క పాత్ర ద‌క్కింది. మ‌రి అందులో విల‌నా? లేదంటే అఖిల్‌కి నాన్న గా క‌నిపించ‌బోతున్నాడా?? అనేది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.