అఫీషియ‌ల్ : ల‌వ‌కుశ అప్ డేట్స్ ఇదే

ఎన్టీఆర్ త్రిపాత్రిభిన‌యం చేసిన సినిమా జై ల‌వ‌కుశ‌. బాబి ద‌ర్శ‌కుడు. ఈ ద‌స‌రాకి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈవారంలోనే ఆడియో విడుద‌ల చేద్దామ‌నుకొన్నారు. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల కొన్ని మార్పులూ చేర్పులూ జ‌రిగాయి. సెప్టెంబ‌రు 3న జై ల‌వ‌కుశ థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్‌ని హైద‌రాబాద్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. 10న ఆడియో క‌మ్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఏర్పాటు చేస్తున్నారు. వేదిక ఎక్క‌డ అన్న‌ది ఇంకా ఖ‌రారు కాలేదు. త‌మ‌న్నాని ఐటెమ్ గాళ్ ఎంచుకొన్న సంగ‌తి తెలిసిందే. ఆ పాట‌ని హైద‌రాబాద్‌లోనే తెర‌కెక్కిస్తార‌ట‌. ఆ పాట పూర్త‌యితే.. దాదాపుగా ల‌వ‌కుశ షూటింగ్ ప‌నులు కంప్లీట్ అయిన‌ట్టే. రాశీఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close