జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన బీజేపీ..!

జమ్మూకశ్మీర్ అసెంబ్లీని… అఘమేఘాలపై రద్దు చేసేశారు గవర్నర్ సత్యపాల్ మాలిక్. ఇప్పటికే రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సుప్తచేతనావస్థలో ఉంది. రాష్ట్రపతి పాలన విధించి.. డిసెంబర్ ప్రథమార్థానికి ఆరు నెలలు పూర్తవుతాయి. ఈ లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి.. మాజీ సీఎం మెహబుబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ, సజ్జాద్‌ లొనె నాయకత్వంలోని పీపుల్స్‌కాన్ఫరెన్స్‌లు తమకు ప్రభుత్వ అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను అభ్యర్థించాయి. ముఫ్తీకి కాంగ్రెస్‌, నేషనల్‌కాన్ఫరెన్స్‌లు మద్ధతు ఇవ్వగా లోనెకు భాజపా మద్ధతిచ్చాయి. అయితే గవర్నర్‌ ఢిల్లీతో సంప్రదింపులు జరిపి అసెంబ్లీ రద్దుకు మొగ్గు చూపారు. ఎందుకంటే.. ఇక్కడ బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కానీ.. ఏర్పాటు చేసినా బలం నిరూపించుకునే పరిస్థితి కాని లేదు.

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీలో ఎక్కువ మంది సభ్యుల మద్ధతు కలిగిన పార్టీ పీడీపీ. దీంతో పాటు కాంగ్రెస్‌, ఎన్‌సీలు మద్ధతు ప్రకటించడంతో మొత్తం ఈ కూటమి బ లం 56కి పెరిగింది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో 89 మంది సభ్యులు ఉన్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్‌కు పీడీపీ లేఖ రాసింది. ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్‌సీ మెహబూబాకు మద్ధతు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీంతో.. ఆ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని.. తెలిసి… కేంద్రం.. వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఉన్న పళంగా.. గవర్నర్ ద్వారా అసెంబ్లీని రద్దు చేయించేశారు. ఓ అసెంబ్లీలో మెజార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నప్పుడు.. అసెంబ్లీని రద్దు చేయడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

నిజానికి ఐదు నెలల కిందట వరకు…జమ్మూకశ్మీర్‌లో బీజేపీ – పీడీపీ ప్రభుత్వం ఉండేది. ముఖ్యమంత్రిగా పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, ఉపముఖ్యమంత్రిగా బీజేపీ నేత ఉండేవారు. అయితే.. కశ్మీర్‌లో హింస పెరుగుతోందన్న కారణం చూపి… మెహబూబా ముఫ్తీకి ఏ మాత్రం… సమాచారం ఇవ్వకుండా.. మద్దతును బీజేపీ ఉపసంహరించుకుంది. అప్పుడే రాష్ట్రపతి పాలన విధించారు. ఆ తర్వాత బీజేపీ.. పీడీపీ పార్టీ ఎమ్మెల్యేలను చీల్చి.. బీజేపీ తరపున ఓ హిందూ ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిని చేయాలని భావించారు. ఆ రాష్ట్రానికి బీజేపీ తరపున ఇన్చార్జ్ గా ఉన్న రామ్‌మాధవ్.. పీడీపీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు పూర్తి చేశారు. అమర్నాథ్ యాత్ర పూర్తయిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే అనుకున్నారు. కానీ.. బీజేపీని నమ్మడానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు సిద్ధపడలేదు. దాంతో బీజేపీ తన ప్రయత్నంలో విఫలమయినట్లయింది. చివరికి కాంగ్రెస్ పార్టీ కూటమిగా.. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడంతో.. బీజేపీ ఉలిక్కి పడింది. నేరుగా అసెంబ్లీని రద్దు చేసింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు.. ఆ రాష్ట్రానికి కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ.. ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేసిన విధానం మాత్రం… కచ్చితంగా ప్రజాస్వామ్య హననమే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close