ఏపీలో జంబో “అడ్వైజర్స్ కేబినెట్”..! కానీ ఒక్కరే ఆల్ ఇన్ వన్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లాం నుంచి అన్ని శాఖలను ముఖ్యమమంత్రి జగన్ తీసేయడంతో… సలహాదారులపై చర్చ ప్రారంభమయింది. అసలు ఎంత మంది సలహాదారులు ఉన్నారు..? వారి జీతభత్యాలేంటి..? వారి ఎవరికి.. ఏ సలహాలిస్తున్నారు..? అన్నదానిపై సాధారణ ప్రజల్లో సైతం చర్చ ప్రారంభమయింది. వివిద సందర్భాల్లో… ప్రభుత్వం పదమూడు నెలల కాలంలో 33 మంది సలహాదారుల్ని నియమించుకుంది. వీరందరికీ.. ఒక్కొక్కరికి.. నెలకు రూ. మూడు లక్షల వరకూ జీతం ఉంది. ఇత భత్యాల రూపంలో మరో రెండులక్షల వరకూ లభిస్తాయి. చాలా మంది సలహాదారులకు.. కారు, డ్రైవర్.. ఇతర సిబ్బంది వంటి సౌకర్యాలు కూడా కల్పించారు. వారికి అదనం.

ఆల్ ఇన్ వన్ సలహాదారుడు సజ్జల మాత్రమే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మొత్తం 33 మంది సలహాదారులు ఉన్నారు. వారందరికీ ఏ ఏ విభాగాల్లో సలహాలు ఇవ్వాలో కూడా.. నిర్దేశించారు. వీరిలో 10 మందికి కేబినెట్ హోదా ఇచ్చారు. కేబినెట్ హోదా ఉన్న వారికి వారి రేంజ్‌లోనే జీతభత్యాలు ఉన్నాయి. ఏపీ సర్కార్‌లో అధికారయంత్రాంగం తరపున చీఫ్‌మినిస్టర్ లాంటి సీఎస్ కన్నా.. సలహాదారులకే ఎక్కువ జీతాలుంటాయి. అంతే కాదు.. అధికారాలు కూడా ఎక్కువే. అజేయకల్లాం, కె.రామచంద్రమూర్తి, సజ్జల రామకృష్ణారెడ్డి, జుల్ఫీరావ్డీ, సాగి దుర్గా ప్రసాదరాజు, తలశిల రఘురాం, జీవీడీ కృష్ణమోహన్, దేవులపల్లి అమర్, పీటర్ హాసన్, ఎం. శామ్యూల్ లకు… కేబినెట్ ర్యాంక్ సలహాదారుల పదవి ఉంది. వీరిలో యాక్టివ్‌గా ఉండేవారు చాలా తక్కువ. కొంత మంది చేసే పనులకు.. ఉన్న పదవికి సంబంధం లేదు. అందరిలో కల్లా.. ఒకే ఒక్క పవర్ ఫుల్ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే. ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన కుడిభజం. ఆయన ఎంత చెబితే అంత. ఆయన చెబితే.. మళ్లీ ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదు. ప్రజా వ్యవహారాల సలహాదారు అని పేరు పెట్టినా… యాక్టింగ్ సీఎంగా.. అన్ని శాఖల వ్యవహారాలనూ చక్క బెడుతూంటారని చెబుతూంటారు. డీజీపీ ఆఫీస్ మొత్తం ఆయన కనుసన్నల్లోనే ఉంటుందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. మిగతా సలహాదారులకు.. పనేమీ ఉండదు కానీ.. సజ్జల మాత్రం… క్షణం తీరిక లేకుండా వ్యవహారాలు చక్క బెడుతూ ఉంటారు.

సలహాదారుల సేవలు వేరే రూపంలో అందుతూంటాయి..!

అజేయకల్లాంకు ఇప్పుడు శాఖల్లేవు. కె.రామచంద్రమూర్తి.. సలహాలు తీసుకోవడం లేదని అలిగి ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. దేవులపల్లి అమర్ అప్పుడప్పుడూ టీవీ చర్చల్లో పాల్గొని..ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించలేక టీవీ చర్చల్లో పాల్గొని వెళ్లిపోతూ ఉంటారు. జీవీడీ కృష్ణమోహన్.. పేరుకు కేబినెట్ ర్యాంక్ సలహాదారు.. కానీ ఆయన మాత్రం.. ముఖ్యమంత్రి స్పీచ్‌లు రాస్తూంటారు. తలశిల రఘురాం.. పార్టీ కార్యక్రమాలను కోఆర్డినేట్ చేస్తూంటారు. ఇప్పుడూ అదే చేస్తారు. కానీ ప్రజాధనం జీతం. మిగిలిన వారికి అసలు పని ఉండదు. కానీ సమయానికి ప్రజా ధనం జీతాల రూపంలో… లక్షలకు లక్షలు అందుతూనే ఉంటాయి. వీరిలో కొంత మంది నియామకం కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. కేబినెట్ ర్యాంక్ ఉన్న జుల్ఫీరావ్డీని .. రస్‌అల్ ఖైమా దేశం నిమ్మగడ్డ ప్రసాద్‌ను పట్టుకున్న తర్వాత గల్ఫ్ దేశాల ప్రతినిధి పేరుతో కేబినెట్ ర్యాంక్‌లో నియమించారు. ఆయన నియామకం ఫలించినట్లుగానే ఉంది…. కానీ ఆయన ఎప్పుడూఎవరికీ కనిపించిన దాఖలాలు లేవు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాయం చేసిన దానికి ప్రజాధనంతో ప్రతిఫలం..!

ఇక కేబినెట్ ర్యాంక్ లేని.. సలహాదారులు.. అలాగే సహాయ సలహాదారులు కూడా 23మంది వరకూ ఉన్నారు. వారికి కేబినెట్ ర్యాంక్ ఉన్న వారితో సమానంగా జీతభత్యాలుంటాయి. ప్రోటోకాల్ లభించదు అంతే. కొంత మందికి.. ప్రత్యేక అబ్లిగేషన్ ప్రకారం.. సలహాదారులుగా నియమించారు. వారికి జీతాలివ్వడం లేదు. ఎన్నికలకు ముందు డేటా చోరీ పేరుతో.. హంగామా చేసిన తుమ్మల లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర్నుంచి … వివిధ సందర్భాల్లో సహకరించిన వారికి కృతజ్ఞతగా పదవులు ఇచ్చినట్లుగా తెలుస్తంది. శిల్పా చేకుపల్లి అనే తెలంగాణ డాక్టర్‌కు ఢిల్లీలో ఉండేలా హెల్త్ సలహాదారు పదవి ఇచ్చింది.. ఆమెకు అక్కడ ఉండేందుకు నివాస అవవసరం తీర్చడానికని.. అధికారవర్గాలందరికీ తెలుసు. ఇలా ప్రజాధనాన్ని సలహాదారులకు… పార్టీ కోసం ప్రచారం చేసిన వారికి.. పార్టీ పెద్దలకు ఇష్టమైన వారికి.. పంచి పెడుతున్నారు. ఒక్కరి సలహాలు తీసుకోరు.. అడగరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం అవసరం  : రామ్మాధవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని..  దాన్ని భర్తీ చేయాలని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రామ్‌మాధవ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోము వీర్రాజు.. ఏపీ  బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు...

చిరు మాస్టర్ ప్లాన్

ఆచార్య త‌ర‌వాత‌.. భారీ లైన‌ప్ అట్టి పెట్టుకున్నాడు చిరంజీవి. ఓ వైపు బాబీకి ఓకే చెప్పిన చిరు, మ‌రోవైపు మెహ‌ర్ ర‌మేష్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇంకోవైపు వినాయ‌క్ తో సినిమా చేయ‌డానికి...

అఖిల్ – సురేంద‌ర్ రెడ్డి ఫిక్స్

`సైరా` త‌ర‌వాత సురేంద‌ర్ రెడ్డి ప్రాజెక్టు ఎవ‌రితో అన్న విష‌యంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. అగ్ర హీరోలంతా బిజీ బిజీగా ఉండ‌డంతో.. సురేంద‌ర్ రెడ్డికి అనుకోని విరామం తీసుకోవాల్సివ‌చ్చింది. కొంత‌మంది కోసం క‌థ‌లు సిద్ధం...

సచివాలయం గాయబ్..!

దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్ర పాలనా కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న భవనాలు నేలమట్టం అయ్యాయి. మొత్తం పదకొండు భవనాలను నామరూపాల్లేకుండా తొలగించేశారు. శరవేగంగా ఇరవై ఐదు...

HOT NEWS

[X] Close
[X] Close