రివ్యూ: కళాపురం

‘పలాస’తో ఆకట్టుకున్న దర్శకుడు కరుణ కుమార్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ముఖ్యంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రెండో సినిమా సుదీర్ బాబుతో చేసిన ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ మాత్రం నిరాశ పరిచింది. ఈ రెండు కూడా సీరియస్ నేపధ్యంలో సాగే కథలే. అయితే ఇప్పుడు వీటికి పూర్తి భిన్నంగా ఒక కామెడీ ఎంటర్ టైనర్ ని చేశాడు. అదే కళాపురం. సత్యం రాజేష్, చిత్రం శ్రీను, ప్రవీణ్ యండమూరి లాంటి మంచి టైమింగ్ వున్న నటులు ప్రధాన పాత్రలు పోషించి ఈ సినిమా ట్రైలర్ ప్రామిసింగా అనిపించింది. సినిమా నేపధ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళాపురం రివ్యూలోకి వెళితే..

కుమార్ (సత్యం రాజేష్) దర్శకత్వ అవకాశాలు కోసం సినిమా ఆఫీసులు చుట్టూ కథలు చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. కుమార్ స్నేహితుడు ప్రవీణ్ (ప్రవీణ్ యండమూరి) హీరో కావాలని ప్రయయత్నిస్తుంటాడు. కుమార్ కి ఇందు (కాశీమ రఫీ) అనే స్టేజ్ ఆర్టిస్ట్ తో రిలేషన్ షిప్ కూడా వుంటుంది. అయితే ఇందు అవకాశవాది. కుమార్ కంటే స్థితివంతుడు దొరకడంతో కుమార్ ని వదిలేస్తుంది. కుమార్ కుమిలిపోతాడు. ఎలాగైనా దర్శకుడై తనని తాను నిరూపించుకోవాలని బలంగా నిర్ణయించుకున్న సమయంలో కుమార్ కి అప్పారావు (పలాస జనార్ధన్) పరిచయమౌతాడు. అప్పారావుకి ప్రొడ్యుసర్ కావాలని కల. కుమార్ గురించి తెలుసుకున్న అప్పారావు.. తాను తీయబోయే సినిమాకి కుమారే దర్శకుడని చేతిలో అడ్వాన్స్ కూడా పెట్టేస్తాడు. అయితే అప్పారావుది ఒక కండీషన్. సినిమా షూటింగ్ కొంత తన స్వగ్రామం కళాపురంలో జరగాలి. ఈ కండీషన్ కి అంగీకరీంచి మిత్రుడు ప్రవీణ్ తో కలసి కళాపురం వెళ్ళిన కుమార్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? కుమార్ సినిమా తీశాడా ? లేదా ? అనేది మిగతా కథ.

తన మొదటి సినిమా పలాసతో మంచి అభిరుచిగల దర్శకుడనిపించుకున్నాడు కరుణ కుమార్. ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ సరిగ్గా ఆడకపోయిన తన ఒరిజినాలిటీని చూపించగలిగాడు. ఇప్పుడు కళాపురంకి వచ్చేసరికి కరుణ కుమార్ ఒరిజినాలిటీ తప్పింది. కారణం.. కళాపురం కథ. ఇలాంటి కథలతో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. ఒక విచిత్రం, అప్పల్రాజు, సినిమా బండి.. సినిమా కష్టాలు నేపధ్యంలో సాగేవే. కళాపురం కథని కూడా సినిమా కష్టాలు నేపధ్యంలో మొదలుపెట్టిన దర్శకుడు.. ఒక ప్రేమకథని కూడా తగిలించాడు. అయితే ఈ ప్రేమ కథ స్టాప్ రాకముందే దిగిపోతుంది. ”అమ్మాయిలు ఎలాగైనా వుండండి.. కానీ క్లియర్ గా వుండండి” అని సందేశం ప్రేమ అధ్యాయం ముగించాడు.

కుమార్ కళాపురం వచ్చిన తర్వాత అసలు కథ మొదలౌతుంది. ఆ గ్రామంలో రకరకలా పాత్రలు పరిచయమౌతుంటాయి. ఆ పాత్రలు నుండి మంచి వినోదాన్ని రాబట్టుకునే అవకాశం వున్నప్పటికీ రచయిత పెన్ను ఆ వైపు కదల్లేదు. సన్నివేశాలని నిదానంగా నడుపుతూ ఎక్కడో చోట వచ్చీరానీ చిన్న కోసం నింపాదిగా డైలాగులు పేర్చుకుంటూ వెళ్లారు. సినిమా ఎలా తీయాలి ? ఎన్ని డిపార్ట్మెంట్లు వుంటాయి ? ఎలా పని చేస్తాయి ? ఇలాంటి వివరాలన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళే క్రమం ఆసక్తిగా వుండదు. ప్రీ క్లైమాక్స్ కోసం వర్మ తీసిన అప్పల్రాజు ట్రాక్ ని అటు ఇటు చేసి వాడేశారు. ఒక చెత్త సినిమా తీసానని కుమార్ ఫీలౌతుంటే అదే సినిమా బ్లాక్ బస్టరైపోతుంది. అయితే దీనికి దర్శకుడు ఇచ్చుకున్న లాజిక్ మరీ నవ్వులాటగా వుంది.

అన్నట్టు చివరి పదినిమిషాల్లో కళాపురం అసలు కథ రివిల్ అవుతుంది. దీనికి పొలిటికల్ టచ్ ఇచ్చాడు దర్శకుడు. అదే గొప్ప ట్విస్ట్ అనుకోని ఈ కథని పట్టాలెక్కించుటారు. కానీ ఆ ట్విస్ట్ రివల్ చేసిన విధానం, కథలో కలిపిన విధానం అస్సల్ కుదరలేదు. ఇమడలేదు. ఆ ట్విస్ట్ చెబుతున్నపుడు ”నాకు రాజకీయాలపై అంత అవగాహన లేదు మేడమ్” అంటాడు కుమార్. ఈ ట్విస్ట్ చూసిన తర్వాత దర్శకుడికి కూడా రాజకీయాలపై అంత అవగాహన లేదనే సంగతి అర్ధమౌతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడో చోట వున్న ఒక ఊరిలో ఎన్నికల కోసం డబ్బులు పంచమని మనసుల్ని ప్రత్యేక్షంగా పురమాయించదు. ఒకవేళ పురమాయించినా నోట్లని పామ్ ప్లేట్ లా పంచుతుంటే ప్రతి పక్షం చేతులుకట్టుకొని కూర్చోదు. ప్రతిపక్షం వరకూ ఎందుకు.. ప్రజలే హంగామా చేసేస్తారు. కుమార్ కి తెలియకుండా డబ్బులు పంచారు సరే. మరి ఆ వూర్లో అంతా ఒక పక్షమేనా ? ప్రతి పక్షం లేదా ? ప్రతిపక్షం లేనప్పుడు డబ్బులు పంచడం ఎందుకు ? పైగా డబ్బులు బాగా పంచారని చివర్లో ముఖ్యమంత్రి ఆఫీస్ లో అభినందన సభ. ఇదంతా సహజత్వానికి చాలా దూరం.

సత్యం రాజేష్ మంచి టైమింగ్ వున్న నటుడు. తనపాత్రని చక్కగా చేసుకుంటూ వెళ్ళాడు. అయితే ఈ పాత్ర అతని బాడీ లాంజ్వేజ్ కి నప్పలేదు. ప్రవీణ్ యండమూరి పాత్ర బావుంది. అతని స్క్రీన్ ప్రజన్స్ కూడా బావుంది. శారద పాత్రలో చేసిన సంచిత ఆమెకి ఇచ్చిన కాస్ట్యూమ్ వలన కొన్ని చోట్ల హీరోయిన్ శోభనని గుర్తు చేస్తుంది. అప్పారావు పాత్రలో చేసిన పలాస జనార్ధన్ నటన ఆకట్టుకుంటుంది. ఆ పాత్రని దర్శకుడు చక్కగా డిజైన్ చేశాడు. చిత్రం శ్రీనుతో పాటు మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.

పరిమిత బడ్జెట్ తో తీసిన సినిమా ఇది. అయితే మణిశర్మ లాంటి అనుభవం గల సంగీత దర్శకుడు వుండటం వలన నేపధ్యం సంగీతం చక్కగా కుదిరింది. క్లబ్బు పాట రాంగ్ ప్లేస్ మెంట్. సినిమా అయిపోయిందని ప్రేక్షకుడు బయటికివెళ్లిపోయే ప్రమాదాన్ని తెచ్చుకున్న పాటది. ప్రసాద్ జీకే కెమరాపనితనంలో మెరుపులు లేవు కానీ ఓకే అనిపిస్తుంది. కరుణ కుమార్ రాసుకున్న కొన్ని డైలాగులు పేలాయి. ప్రొడక్షన్ డిజైన్ ఇంకాస్త బెటర్ గా చేయాల్సింది.

థియేటర్ సినిమా, ఓటీటీ సినిమా అనే వర్గీకరణ స్పష్టంగా వచ్చేసింది. అయితే పరిమిత బడ్జెట్ లో తీసినా.. బలమైన కంటెంట్ వుంటే.. థియేటర్ కి జనాలు వస్తారని కొన్ని సినిమాలు నిరూపించాయి. కళాపురం మాత్రం ఓటీటీలో చూద్దాలే అనుకునే జాబితాలోకి వెళ్ళింది.

ఫినిషింగ్ టచ్ : ‘కళ’ తప్పింది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close