ఏపీలో ‘ఒక ఎమోష‌న్‌’ కోసం క‌న్నా వెతుకులాట‌..!

భాజ‌పా రాజ‌కీయ‌మంటే క‌చ్చితంగా ఏదో ఒక భావోద్వేగాన్ని ఆధారంగా చేసుకునే ఉంటుంది! ఉత్త‌రాది రాష్ట్రాల్లో హిందుత్వ కార్డుని తురుపుముక్క‌లా వాడేస్తారు. ఆ ఫార్ములా కొన్ని రాష్ట్రాల్లో బాగా వ‌ర్కౌట్ అయింది. అయితే, ద‌క్ష‌ణాదికి వ‌చ్చేస‌రికి… అది ప‌నిచేయ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఏ టాపిక్ ప‌ట్టుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్తే ఆద‌ర‌ణ పొంద‌గ‌లం అనేది భాజ‌పాకి అర్థం కావ‌డం లేదు. ఇక్క‌డ ఆద‌ర‌ణ పెంచుకోవాలంటే స్థానికంగా ఉన్న ఏదో ఒక ఎమోష‌న‌ల్ అంశాన్ని తీసుకుంటే త‌ప్ప వ‌ర్కౌట్ కాని ప‌రిస్థితి. కానీ, భాజ‌పాపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. ఈ మ‌ధ్య కేంద్రం అనుస‌రిస్తున్న తీరు రోజురోజుకీ దాన్ని పెంచుతూనే ఉంది. అయితే, ఇలాంటి స‌మ‌యంలో కూడా ఆంధ్రాపై మోడీకి ఎంతో ప్రేమ ఉంద‌నే అంశాన్ని ప‌దేప‌దే చెబుతున్నారు ఏపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌.

తాజాగా ఓ స‌మావేశంలో క‌న్నా మాట్లాడుతూ… 2014లో రాష్ట్ర విభ‌జ‌న వ‌ల్ల ఆంధ్రుల మ‌నోభావాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయ‌న్నారు. ఆ బాధను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ గుర్తించార‌నీ, అందుకే రాష్ట్రాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటున్నార‌న్నారు. ఆంధ్రుల మ‌నోభావాల‌ను అర్థం చేసుకున్నారు కాబ‌ట్టే, ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డానికి ప‌దేళ్లు స‌మ‌యం ఉన్నా… కేవ‌లం నాలుగేళ్ల‌లోనే పూర్తి చేశార‌న్నారు! అయితే, కేంద్రం ఇచ్చిన నిధుల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌క్ర‌మంగా వినియోగించ‌డం లేదన్నారు. అవినీతీ అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌నీ అవ‌న్నీ బ‌య‌ట‌ప‌డ‌తాయ‌న్న భ‌యంతోనే కేంద్రంపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు.

విభ‌జ‌న‌తో గాయ‌ప‌డ్డ ఆంధ్రుల మ‌నోభావాల‌ను మోడీ మాత్ర‌మే అర్థం చేసుకున్నార‌నే అంశాన్ని క‌న్నా ప్ర‌ముఖంగా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అంతేకాదు, ప‌దేళ్ల‌పాటు స‌మ‌యం ఉన్నా నాలుగేళ్ల‌కే ఇచ్చిన హామీల‌న్నీ పూర్తి చేశామ‌ని మ‌రోప‌క్క చెబుతున్నారు. మోడీకి ఆంధ్రుల మ‌నోభావాలు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ చెప్పినంత బాగా అర్థమై ఉంటే… రైల్వే జోన్ సాధ్యం కాద‌నీ, క‌డ‌ప ఫ్యాక్ట‌రీ ఇవ్వ‌లేమ‌నీ ఎందుకు చెబుతారు, ఇచ్చిన నిధుల‌ను ఎందుకు వెన‌క్కి తీసుకుంటారు, పోల‌వ‌రంపై ఎందుకు జాప్యం చేస్తున్నారు..? సుప్రీం కోర్టులో ద‌శ‌ల‌వారీగా దాఖ‌లు చేస్తున్న అఫిడ‌విట్ల ప‌రిస్థితేంటి..? ఇవ్వ‌లేమ‌ని చెబుతున్న‌ది వారే… కానీ, అడ్డుకుంటున్న‌ది ఆంధ్రా అని ఉల్టా ప్ర‌చారం చేస్తుండ‌టం ఆశ్చ‌ర్యం! మొత్తానికి, క‌న్నా ప్ర‌య‌త్నం ఏంటంటే… ‘విభ‌జ‌న గాయం’ అనే ఎమోష‌నల్ అంశాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం. కానీ, అది సాధ్య‌మా..? దాని గురించి భాజ‌పా నేత‌లు ఎంత‌గా మాట్లాడితే… ఏపీలో మ‌రింత వ్య‌తిరేక‌త పెరుగుతుందే త‌ప్ప‌, అనుకూలంగా మారే అవ‌కాశం అస్స‌లు లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close