కలకలం రేపిన కార్తీకారెడ్డి ఎపిసోడ్

హైదరాబాద్ మాజీ మేయర్ హటాత్తుగా పార్లమెంట్ భవనంలో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ లో కనిపించడం కలకలం రేపింది. ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన కీలక సమాచారం తన దగ్గరుందని రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో చెప్పారు. ఆ సందర్భంగా ఆయన చుట్టూ చాలా మంది కాంగ్రెస్ నాయకులు, ఎంపీలు ఉన్నారు. వారితోపాటు మాజీ మేయర్ బండ కార్తీకా రెడ్డి, ఆమె భర్త కూడా ఉండటం సంచలనం కలిగించింది.

లైవ్ లో ఈ దృశ్యాలు కనిపించగానే పలు తెలుగు న్యూస్ చానల్స్ లో ఇదే బ్రేకింగ్ న్యూస్ అయింది. సరిగ్గా రాహుల్ గాంధీ వెనకే కార్తీక ఉండటంతో ఆమె పార్లమెంటు భవనంలోకి ఎలా వెళ్లింది, వెళ్లడం తప్పు కదా అంటూ రకరకాల ఊహాగానాలతో చానల్స్ ఊదరగొట్టాయి. ఎంపీ పాస్ ద్వారా ఆమె పార్లమెంటుకు వెళ్లారట. ఎస్ పి జి భద్రతా వలయాన్ని తప్పించుకుని కమిటీ హాలు వరకూ వెళ్లి రాహుల్ గాంధీని కలిశారట. రాహుల్ కు సన్మానం కూడా చేశారట. ఇదీ బ్రేకింగ్ న్యూస్ సారాంశం.

ఎంపీ పాస్ ద్వారా పార్లమెంట్ సమావేశాలను చూడటానికి సందర్శకులు వెళ్లే అవకాశం ఉంది. అలాగే ప్రత్యేకమైన అపాయింట్ మెంట్ ద్వారా నాయకులను కలవడానికి కొందరు ప్రముఖులకు అవకాశం కూడా ఉంటుంది. కార్తీక మాజీ మేయర్. కాబట్టి అపాయింట్ మెంట్ తీసుకుని వెళ్లారా లేక ఎంపీ పాస్ ను దుర్దినియోగం చేశారా అనేది నిర్ధారణ కావాల్సి ఉంది.

ఇటీవల క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా పార్లమెంట్ భవనంలోని ప్రధాని కార్యాలయానికి వెళ్లారు. తన పెళ్లి శుభలేఖ ఇచ్చారు. ముందస్తు అపాయింట్ మెంట్ తీసుకుని ప్రధానిని కలిశారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు. ఆయన్ని కార్తీక అపాయింట్ మెంట్ తీసుకుని పార్లమెంట్ కమిటీ హాలులో కలిసి ఉంటే అది వేరే విషయం. ఏదీ నిర్ధారణ కాకుండానే కొన్ని చానళ్లు ఇష్టం వచ్చినట్టు బ్రేకింగ్ న్యూస్ తో కలకలం రేపాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close