తెలంగాణలోనూ ఉచిత వ్యాక్సిన్..!

తెలంగాణలోనూ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రజల ప్రాణాలు ముఖ్యం కానీ డబ్బు కాదని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ వ్యాక్సిన్ వేయించాలంటే రెండున్నర వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఆ మొత్తం ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు. మే ఒకటి నుంచి పద్దెనిమిదేళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతున్నందున.. కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపించే టీకాలు ఉచితమేనని… ప్రకటించింది. అయితే..కేంద్రం పంపించే టీకాలు… ఆయా రాష్ట్రాల జనాభాల్లో పది శాతంమందికి కూడా చేరవు. కేంద్రం నుంచి వచ్చే వ్యాక్సిన్లనే వేయాలంటే.. మూడు, నాలుగేళ్లు వ్యాక్సినేషన్ కార్యక్రమం పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే.. తాము అంత ఎక్కువగా.. సరఫరా చేయలేం కాబట్టే.. కొనుక్కోవడానికి కేంద్రం అవకాశం ఇచ్చింది. పెద్ద ఎత్తున విదేశీ కంపెనీలకు వ్యాక్సిన్ అమ్ముకునేందుకు అనుమతి ఇస్తున్నారు. దేశీయ వ్యాక్సిన్ తయారీదారులు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి రుణాలు కూడా ఇచ్చారు.ఈ క్రమంలో రాష్ట్రాలు ఇతర మార్గాల ద్వారా వ్యాక్సిన్లు సమకూర్చుకునే అవకాశం కల్పించింది.

ఎలా చూసినా వ్యాక్సిన్ … రాష్ట్ర ప్రభుత్వాలకు భారం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎంత భారం అవుతుందన్న దానిపై అంచనాలు లేకపోయినా… రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఖర్చులు భరించేందుకు సిద్దమవుతున్నాయి. ఏపీ సర్కార్ రూ. పదహారు వందల కోట్లు ఖర్చవుతుందని నిర్ణయించుకున్నాయి. తెలంగాణలో ఆ ఖర్చు రెండున్నర వేల కోట్లుగా అంచనా వేశారు. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలు కూడా… తాము కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ కేసులో కీలక పత్రాలు బయటపెట్టిన బండి సంజయ్ – ఎలా ?

ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు అనేక సార్లు చెప్పినప్పటికీ ఆయన కోసమే తాము ట్యాపింగ్ చేశామని నిర్దారించినప్పటికీ కేసీఆర్ కు ఇంత వరకూ నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని...

మీడియా వాచ్ : “స్టడీ”గా రవిప్రకాష్ ఈజ్ బ్యాక్ !

సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చాలా వస్తాయి. కానీ స్టడీలు మాత్రం కొన్నే ఉంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రవిప్రకాష్ స్టడీ హాట్ టాపిక్ అవుతోంది. RTV స్టడీ...

వృద్ధుల ప్రాణాలతో రాజకీయం – ఇంత క్రూరమా ?

ఏపీ ప్రభుత్వానికి వృద్ధులను ఎంత హింసిస్తే అంత మంచి రాజకీయం అనుకుంటున్నారు. వాళ్లు ఎంత బాధపడితే అంతగా చంద్రబాబును తిట్టుకుంటారని ఊహించుకుంటూ వాళ్లను రాచి రంపాన పెడుతున్నారు. ఇంటింటికి పంపిణీ చేసేందుకు...

ఓటేస్తున్నారా ? : ఏపీ రాజధానేదో ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి !

పాలకుడు సొంత రాష్ట్రంపై కుట్రలు చేసుకునేవాడు అయి ఉండకూడదు. సొంత ప్రజల్ని నాశనం చేసి తాను ఒక్కడినే సింహాసనంపై కూర్చుని అందర్నీ పీల్చి పిప్పి చేయాలనే వ్యక్తిత్వం ఉండకూడదు. అలా ఉంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close