చర్చలు కొనసాగుతాయని చెప్పిన కేసీఆర్

జాతీయ రాజ‌కీయాల‌పైనే ప్ర‌ధానంగా చ‌ర్చించేందుకు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీతో, తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజయం సాధించిన త‌రువాత కేసీఆర్ ఫోక‌స్ అంతా ఢిల్లీ వైపే ఉంది! కాంగ్రెసేత‌ర‌, భాజ‌పాయేత‌ర ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తి కేంద్రంలో అధికారంలోకి రావాలనే ప్ర‌య‌త్నంలో భాగంగా ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లు ప్రారంభించారు. మ‌మ‌తాతో భేటీ అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

మ‌మతా బెన‌ర్జీతో భేటీ సంద‌ర్భంగా చాలా అంశాలు చ‌ర్చించామ‌న్నారు. ఈ ప్ర‌క్రియ మున్ముందు ఇంకా కొన‌సాగుతుంద‌న్నారు. త‌న ప్ర‌య‌త్నాల‌ను నిన్న‌ట్నుంచే ప్రారంభించాన‌నీ, దాన్లో భాగంగా ఒడిశా ముఖ్య‌మంత్రిని క‌లిసి వ‌చ్చా అన్నారు కేసీఆర్‌. ఎన్నిక‌ల్లో తాను మ‌రోసారి గెలిచిన వెంట‌నే మ‌మ‌తా బెన‌ర్జీ ఫోన్ చేసి అభినందించార‌ని చెప్పారు. త‌మ భేటీలో రాష్ట్రాల‌కు సంబంధించిన అంశాల‌తోపాటు, జాతీయ రాజ‌కీయాల‌పై కూడా చ‌ర్చ జ‌రిగింద‌న్నారు. త‌మ చ‌ర్చ‌లు మున్ముందు ఇంకా కొన‌సాగుతాయ‌నీ, ఒక స్ప‌ష్ట‌మైన ప్ర‌ణాళిక‌తో తాము కొద్దిరోజుల్లోనే స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేస్తామ‌న్నారు. భాజ‌పా, కాంగ్రెస్ ప్ర‌మేయం లేని ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల కోస‌మే మీరు చ‌ర్చించారా అంటూ విలేక‌రుల అడిగిన ప్ర‌శ్న‌కు స్పందిస్తూ… అది కేసీఆర్ మిష‌న్ కాద‌నంటూ చెప్పారు.

త‌న ఆలోచ‌నా విధానాన్ని కొన‌సాగిస్తాన‌నీ, ఇది ఏదో చిన్న విష‌యం కాద‌నీ, వెంట‌వెంట‌నే నిర్ణ‌యాలు జ‌రిగిపోవ‌డానికి అన్నారు. ఈ దిశ‌గా చర్చ‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌నీ, త్వ‌ర‌లోనే ఒక శుభవార్త చెబుతామ‌నీ, ఆరోజున కేసీఆర్ విజ‌న్ ఏంట‌నేది అర్థ‌మౌతుంద‌న్నారు. జాతీయ రాజ‌కీయాల‌పై మ‌మ‌తా బెన‌ర్జీతో చ‌ర్చించాన‌ని చెప్పారుగానీ… భాజ‌పాయేత‌ర‌, కాంగ్రెసేత‌ర రాజ‌కీయాల‌పైనే ప్ర‌ధానంగా చ‌ర్చ‌లు సాగాయా అనేది కేసీఆర్‌ స్ప‌ష్టంగా చెప్ప‌లేదు. చ‌ర్చ‌లు కొన‌సాగుతాయ‌ని ముగించేశారు! నిజానికి, కాంగ్రెస్ భాజ‌పాల‌ను కాద‌నే ప‌రిస్థితి ప్ర‌స్తుతానికి తెరాస‌కు ఉందేమోగానీ… ఈ రెండు జాతీయ పార్టీల్లో ఏదో ఒక‌టి లేని ఢిల్లీ రాజ‌కీయాలుంటాయ‌నే అంశాన్ని ఇప్ప‌టికిప్పుడు ఇత‌ర రాష్ట్రాల్లోని పార్టీలు న‌మ్మే ప‌రిస్థితి కొంత త‌క్కువ‌గా క‌నిపిస్తోంది. పైగా, కేసీఆర్ మొద‌లుపెట్టిన ఈ ప్ర‌యోగం ఎటువైపు వెళ్తుందా అనేది కొన్నాళ్ల‌పాటు వారూ వేచి చూస్తారు క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close