ఎన్‌కౌంటర్‌కు జగన్‌ ప్రశంసలు…’దిశ చట్టం’పై కేసీఆర్‌ మౌనం…!

హైదరాబాదులో దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని చాలామంది ప్రశంసించారు. ఎన్‌కౌంటర్‌ చేయడం న్యాయమేనని పొగిడినవారిలో కొందరు ముఖ్యమంత్రులు, సినిమా తారలు, వివిధ రంగాల ప్రముఖులు ఉన్నారు. ఇక తెలంగాణ మంత్రులైతే ఎన్‌కౌంటర్‌ క్రెడిట్‌ కేసీఆర్‌దేనంటూ ఆకాశానికి ఎత్తేశారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పూర్తిగా సమర్థించి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. అది కూడా చట్టసభలోనే ఎన్‌కౌంటర్‌ను సమర్ధించడం విశేషం.ఒకసారి కాదు, రెండుసార్లు ఎన్‌కౌంటర్‌ను సమర్థించి, ఆ క్రెడిట్‌ కేసీఆర్‌కు కట్టబెట్టారు. అసెంబ్లీలో జగన్‌ మాట్లాడింది వింటే కేసీఆరే దగ్గరుండి ఎన్‌కౌంటర్‌కు ప్లాన్‌ చేయించినట్లు అర్థమవుతుంది.

జగన్‌ దృష్టిలో ఎన్‌కౌంటర్‌ అనేది సరైన శిక్ష. తెలంగాణ మంత్రులు కూడా కేసీఆరే ఎన్‌కౌంటర్‌ చేయించినట్లు మాట్లాడారు. జగన్‌ వారి దారిలోనే నడిచారు. ఈ ఎన్‌కౌంటర్‌ స్ఫూర్తితోనే ఆయన ‘దిశ చట్టం’ రూపకల్పన చేశారనిపిస్తోంది. అత్యాచార కేసులో దోషులని తేలినవారికి ఉరిశిక్ష తప్ప మరొకటి జగన్‌ అంగీకరించలేదు. దిశ చట్టంలోనూ ఇదే ఉంది. ఏడు పనిదినాల్లో పోలీసు దర్యాప్తు, మొత్తం 21 రోజుల్లో కోర్టులో విచారణ సహా శిక్ష ఖరారు కావాలని దిశ చట్టం దిశానిర్దేశం చేసింది. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌కు ఎంతటి ప్రశంసలు వచ్చాయో, దిశ చట్టానికి కూడా అంతటి ప్రశంసలు వస్తున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ చట్టాన్ని మెచ్చుకొని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.

కేరళ ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని తాము పరిశీలిస్తామని తెలిపింది. ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మాలివాల్‌ దిశ చట్టాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. రేప్‌ కేసుల్లో దోషులకు మరణశిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తూ 13 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ను కొందరు పూర్తిగా వ్యతిరేకించినవారు కూడా దిశ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించలేదు. కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అయితే ఈ చట్టంపై ఇప్పటివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన అభిప్రాయం చెప్పిన దాఖలా లేదు. ఇందుకు సంబంధించి మీడియాలో ఎలాంటి వార్తా రాలేదు. ఆర్‌టీసీ సమ్మె జరిగినప్పుడు ఏపీఎస్‌ఆర్‌టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు.

టీఎస్‌ఆర్టీసీని ఎట్టి పరిస్థితిలోనూ ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని చెప్పిన కేసీఆర్‌ ఎపీఎస్‌ఆర్టీసీ ని జగన్‌ విలీనం చేయలేడనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన అభిప్రాయానికి వ్యతిరేకంగా జరుగుతోంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం దిశ చట్టం చేసేసరికి కేసీఆర్‌ చేయాల్సిన పని జగన్‌ చేశారంటూ జనం ప్రశంసిస్తున్నారు. హైదరాబాదులో జరిగిన ఘటనకు జగన్‌ వెంటనే స్పందించి వేగంగా చట్టం చేయడాన్ని మెచ్చుకుంటున్నారు. ఏపీలో ఆర్‌టీసీ విలీనం జరగబోదని చెప్పిన కేసీఆర్‌ ఈ చట్టంపై మాత్రం ఏమీ మాట్లాడటంలేదు. కేసీఆర్‌ చేసిన పనిని (ఎన్‌కౌంటర్‌) జగన్‌ మెచ్చుకున్నా, జగన్‌ చేసిన పనిని (దిశ చట్టం) కేసీఆర్‌ మెచ్చుకోలేదని కొందరు అంటున్నారు. దిశ చట్టం చేయడం వరకు బాగా ఉందిగాని అది అమలు ఎలా అవుతుందో చూడాలి.

ఈ చట్టంపై న్యాయవాదులు కొన్ని సందేహాలు టీవీ చర్చల్లో లేవనెత్తుతున్నారు. 7 రోజుల్లో పోలీసు దర్యాప్తు జరిగి, మొత్తం కేసు విచారణ 21 రోజుల్లో ముగించడం అసాధ్యమంటున్నారు. ఒకవేళ అలా ముగించినా తరువాత హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి 21 రోజుల్లో శిక్ష పడే అవకాశం లేదంటున్నారు. సరే…దిశ చట్టం అమల్లోకి రావాలంటే కేంద్రం అంగీకరిచాలి. రాష్ట్రపతి ఆమోదం పొందాలి. మరి ఈ చట్టంలో ఎలాంటి మార్పులు కలుగుతాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close