కేసీఆర్‌కు అంత పక్కాగా ఎన్నికల షెడ్యూల్ ఎలా తెలిసింది..?

“నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతాయి. మూడు రాష్ట్రాల్లో ఒక విడత పోలింగ్‌ ఉంటుంది, మధ్యప్రదేశ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్‌ ఉంటుంది” ఇది.. ఏ ఎన్నికల సంఘం అధికారి చెప్పిందో కాదు. స్వయంగా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి… కేసీఆర్.. నిన్న ప్రెస్‌మీట్‌లో చెప్పిన మాటలు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పక్కాగా ప్రిపరేషన్ చేసుకుని ఉంటే.. మహా అయితే తెలంగాణ గురించి ప్రకటించవచ్చు కానీ… నవంబర్‌లో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలు, అవి ఎన్ని విడతల్లో జరుగుతాయో.. ఎలా చెబుతారు..? అంత పక్కాగా సమాచారం ఆయనకు ఎవరిస్తారు..?

తెలంగాణ ఎన్నికల ప్రక్రియ.. అక్టోబర్‌లో ప్రారంభమై నవంబర్‌లో ముగుస్తుందని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత కూడా.. నవంబర్, డిసెంబర్‌లలో ఎన్నికలు రావని..మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేసీఆర్ తోసి పుచ్చారు. మీడియాలో వస్తున్నంత గందరగోళం లేదని తేల్చేశారు. అక్టోబర్‌ మొదటి వారంలో ఎన్నికల ప్రక్రియ మొదలై నోటిఫికేషన్‌ వస్తుంది.. నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబరు మొదటి వారంలో ఎన్నికల ఫలితాలు ప్రకటించే అవకాశముందని కేసీఆర్ .. ఎన్నికల ప్రధాన అధికారి తనకు స్పష్టంగా చెప్పినట్లుగా చెప్పుకొచ్చారు. తాను స్వయంగా కేంద్ర ముఖ్య ఎన్నికల అధికారితో, మిగతా ఇద్దరు కమిషనర్లతో మాట్లాడానని కూడా చెప్పుకొచ్చారు. అంటే.. తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయక ముందే.. ఈసీ కూడా.. షెడ్యూల్ రెడీ చేసిందా..?

ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా..స్వతంత్రంగా విధులు నిర్వహించాల్సిన సంస్థ. ఆ సంస్థ పక్కాగా తన విధులు నిర్వహిస్తుందో..ఎన్నికలపైన అంత విశ్వాసం ఉంటుంది. టీఎన్ శేషన్ ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్నప్పుడు.. ఈసీ విలువేంటో అందరికీ తెలిసింది. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు… ఈసీ కంటే ముందే.. ఆయా రాజకీయ పార్టీలు షెడ్యూళ్లు ప్రకటిస్తున్నారు. గతంలో గజరాత్ , కర్ణాటక ఎన్నికల షెడ్యూళ్లను బీజేపీ సోషల్ మీడియా విభాగం ముందుగా ప్రకటించడం వివాదాస్పదమయిది. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్.. మిగతా రాష్ట్రాల షెడ్యూళ్లను కూడా ప్రకటించినంత పని చేశారు. మొత్తానిక ముందస్తు విషయంలో తెర వెనుక చాలా గూడుపుఠాణి జరిగిందని మాత్రం క్లారిటిగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close