వైసీపీ లైన్‌లోనే కేశినేని !

కేశినేని నాని, ఆయన కుమార్తె పూర్తిగా వైసీపీ లైన్‌లోనే వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. రోజూ ఏదో ఓ ప్రకటన చేసి.. వైసీపీ మీడియాకు ఫీడ్ అందించే ప్లాన్ ప్రకారమే .. వ్యవహారాలు నడుపుతున్నారు. కేశినేని శ్వేత కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయడానికి పెద్ద షో చేశారు. తీరా వెళ్లి మేయర్ కు రాజీనామా లేఖ ఇచ్చారు. అందు కోసం పక్కా ఏర్పాట్లు చేసుకున్నారు. మేయర్ తో పాటు వైసీపీ కార్యకర్తలు, మీడియా సమయానికి తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు. శ్వేత కూడా ముందుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటికి వెళ్లి రాజకీయం ప్లే చేశారు. తనకు గద్దె రామ్మోహన్ బీఫాం ఇచ్చారని అందుకే ఆయనను కలవడానికి వెళ్లానని చెప్పుకొచ్చారు.

మరి కేశినేని నాని.. తనకు బీఫాం ఇచ్చిన చంద్రబాబును కలిసి చెబుతారా అన్న ప్రశ్న సాధారణం వస్తుంది. పైగా.. కేశినేని శ్వేత రాజీనామా చేసే సమయంలో పక్కన వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవ సత్యం.. ఆమె వెన్నంటే ఉన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసినప్పుడు కేశినేని నాని కానీ.. శ్వేత కానీ కనీసం స్పందించలేదు. రాజీనామా తర్వాత ఆమె.. తమకు ఏడాదిన్నర నుంచి అవమానాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.

కానీ మూడేళ్ల పాటు వారు చేసిన పనులను చూసిన తర్వాతనే ఇక మారరని పార్టీ పక్కన పెట్టిందని మాత్రం గుర్తించలేకపోయారు. తిరువూరు సభకు ఇంచార్జ్ గా చిన్నిని నియమించినా సన్నాహాక సమావేశానికి వెళ్లి రచ్చ చేశారు. కావాలనే ఈ రాజకీయాలు మొత్తం వైసీపీ వ్యూహం ప్రకారం చేస్తున్నారని అంటున్నారు. సమయం చూసుకుని వారు వైసీపీలో చేరిపోతారని.. విజయవాడ పార్లమెంట్ కు వైసీపీ తరపున కేశినేని నానినే అభ్యర్థిగా ఉంటారని ఇప్పటికే వైసీపీలోనూ చర్చ జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close